అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరే వేరు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అసలు ప్రపంచంలోనే అతి తెలివైన వాళ్ళు గా భావింపబడే అమెరికన్లు ఇలాంటి వాడిని అధ్యక్షుడిగా ఎలా ఎన్నుకున్నారు అని అంతా అనుకున్నారు. కొద్దిరోజుల్లోనే అతను అమెరికన్లకు చుక్కలు చూపించడం స్టార్ట్ చేశాడు. ఇక వారి దరిద్రం కొద్దీ ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే కరోనా వైరస్ సోకింది. ఇంకేముంది ప్రపంచంలోనే అత్యధిక కేసులు ఉన్న దేశంగా అమెరికా కొద్ది వారాల్లోనే అవతరించింది. ఆ తర్వాత ఇప్పటికీ దాని వేగం కంట్రోల్ కాలేదు.
గతంలోనే వైరస్ వ్యాప్తి భారీగా ఉన్న సమయంలో లాక్ డౌన్ విధించలేదని ట్రంప్ పై భారీగా విమర్శలు వచ్చాయి. ఇక ఇప్పుడు వైట్ హౌస్ సలహాదారులు, అంటువ్యాధుల నివారణ నిపుణులు మాస్కులను అమెరికన్లు అంత ఖచ్చితంగా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. దీనిని తప్పనిసరి చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సూచించారు. అలా పెట్టుకోకపోతే దేశంలో రానున్న రోజుల్లో పరిస్థితి తీవ్రం అవుతుందని హెచ్చరించారు.
అయితే మన ట్రంప్ మాత్రం దేశంలో మాస్కు తప్పనిసరి చేస్తూ తాను అసలు ఆదేశాలు జారీ చేయానని.. వైరస్ వ్యాప్తి ఎంత తీవ్రంగా ఉన్నా తాను సైతం మాస్క్ పెట్టుకునే పరిస్థితి లేదని కుండబద్దలు కొట్టాడు. ఇప్పటికీ మాస్క్ కూడా పెట్టుకోకుండా తిరిగే మన ట్రంప్ మొన్న మిలిటరీ ఆసుపత్రిలో ఉన్నప్పుడు మాత్రమే మాస్క్ ను వాడాడు. ఇక మాస్క్ తప్పనిసరి అనే విషయమై అమెరికా రాజకీయ నేతలతో పాటు ప్రజలు కూడా రెండుగా చీలిపోయారు. కొంతమంది గవర్నర్ లు ఖచ్చితం అంటే కొందరు అవసరం లేదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. అసలు ట్రంప్ ప్రాబ్లం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు.