NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

ట్రంప్ కరుణామయుడు అయ్యాడు!!దీనిలోను ట్విస్ట్ ఉంది మరి 

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్… కరుణామయుడు అవతారమెత్తారు. మొన్నటి వరకు తానే గెలిచానని.. న్యాయస్థానాల్లో పోరాటం చేస్తారని అధికార మార్పిడి సైతం ఒప్పుకోని ఇప్పుడు నిజం లోకి వచ్చినట్లుగా కనిపిస్తోంది… అమెరికా అధ్యక్షుడు వద్ద పెండింగ్లో ఉన్న ఎన్నో క్షమాభిక్ష లను ఆయన ఓకే చేస్తున్నారు. ఎంతో మంది క్షమాభిక్ష ప్రసాదిస్తూ సంతకాలు పెడుతున్నారు. ఇది ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తోంది.


** అమెరికాలో కొత్త అధ్యక్షుడు గెలిచిన వెంటనే వైట్ హౌస్ లోకి వెళ్లి అధికారం చేపట్టడానికి వీలు లేదు. పాత అధ్యక్షుడు నుంచి కొత్త అధ్యక్షుడికి అధికార మార్పిడి జరగాలంటే కొద్ది రోజులు సమయం పడుతుంది. అమెరికా రాజ్యాంగ వ్యవస్థ ఇదే చెబుతుంది. మొన్నటి ఎన్నికల్లో గెలిచిన జో బైడెన్ కు అమెరికా అధ్యక్ష పదవి అధికారం రావాలంటే ఇంకో నెలపాటు ఆగాల్సి ఉంటుంది. అప్పటివరకు ట్రంప్ కు అధ్యక్షుడి తరహా అన్ని అధికారాలు ఉంటాయి.
** నిన్న మొన్నటి వరకూ ఇదే పద్ధతిలో ట్రంపు తాను ఎన్నికలలో నెగ్గానని మారం చేశారు. అయితే అధికార మార్పిడికి సమయం దగ్గర పడటంతో ఆయన నిజం లోకి వచ్చినట్లు కనిపిస్తోంది అయితే పనిలోపనిగా… అమెరికా అధ్యక్షుడు వద్ద ఉన్న పలువురు యుద్ధ ఖైదీలు నేరస్థుల క్షమాభిక్ష లను ఆయన వెనువెంటనే ఆమోదిస్తున్నట్లు తెలిసింది. ఏకంగా గత మూడు రోజులుగా నలభై ఒక్క మందికిపైగా క్షమాభిక్షను ట్రంపు ఆమోదించినట్లు తెలుస్తోంది.
** అయితే ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. నేరస్తులకు క్షమాభిక్ష లతో పాటు తాను స్వీయ క్షమాబిక్ష సైతం ట్రంప్ ఆమోదించినట్లు తెలుస్తోంది. అంటే తాను కూడా ఏదో విషయంలో తప్పు చేశానని దానికి ఆయన స్వయంగా అప్లికేషన్ రూపొందించుకుని ఆయన దానిపై సంతకం చేశాడన్న మాట… దీనినే స్వీయ క్షమాభిక్ష అంటారు.


** అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలవడానికి అమెరికా ప్రధాన శత్రువు అయిన రష్యా సాయం చేసినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై ఇప్పటికే ప్రాథమిక సాక్ష్యాలు సేకరించిన జో బైడెన్ దీనిలో ట్రంపును ఇరికించేందుకు, ఆయనతో పాటు ఆయన టీంలో పని చేసిన కొందర్ని… అలాగే ట్రంప్ కుటుంబ సభ్యుల్ని సైతం ఈ కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ట్రంపు స్వీయ క్షమాభిక్ష ప్రసాదించు కొన్నారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ఆయన దగ్గర పనిచేసిన వారికి సైతం క్షమాభిక్ష ప్రసాదించారు.
** ఏదైనా నేరం నిరూపణ చేసిన వారికి క్షమాభిక్ష ప్రసాదించడం పరిపాటి. అలాగే నేరం నమోదు చేసిన తర్వాత కోర్టులో విచారణ ఉన్న సమయంలో సైతం క్షమాభిక్షకు నిందితులు అడిగితే దానిని ఆమోదించవచ్చు. ఇప్పుడు ట్రంపు చేసిన క్షమాభిక్ష లు స్వీయ క్షమాభిక్షల్లో ఎలాంటి నేర నమోదు జరగలేదు. నేర నమోదు జరగకుండానే క్షమాభిక్ష ప్రసాదించిన ట్రంప్ ఇప్పుడు కరుణామయుడు రూపంలో కొత్త వివాదానికి దారి తీశారు.

author avatar
Comrade CHE

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk