Donald Trump: హుష్ మనీ కేసులో నిందితుడైన అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మంగళవారం భారీ నిరసనల మధ్య న్యూయార్క్ మాన్‌హట్టర్ క్రిమినల్ కోర్టులో లొంగిపోయారు. ట్రంప్ నుండి అధికారులు ఫింగ్ ప్రింట్స్ తీసుకున్నారు. పోలీసులు ట్రంప్ ను కస్టడీలోకి తీసుకున్నారు. ట్రంప్ ను పోలీసులు జైలుకు తరలించనున్నారు. ఫోర్న్ స్టార్ కు చెల్లింపుల కేసులో కోర్టు విచారణలో ట్రంప్ తన వాదనలు వినిపించారు. బెయిల్ పిటిషన్ పై వాదనలు జరుగుతున్నాయి. తాను ఏ తప్పు చేయలేదని ట్రంప్ పేర్కొంటున్నారు. తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

అమెరికా చరిత్రలో క్రిమినల్ అభియోగాలు ఎదుర్కొంటున్న తొలి మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రికార్డులోకి ఎక్కారు. 2024 రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్ధి అయిన ట్రంప్ మెడకు ఫోర్న్ స్టార్ కు చెల్లింపుల వ్యవహారం చుట్టుకుంది. గత వారమే గ్రాండ్ జ్యూరీ ట్రంప్ పై నేరాలు ఖరారు చేసింది. పత్రాలు తారు మారు చేశారన్న అభియోగాలతో పాటు 30 నేరాలను ట్రంప్ ఎదుర్కొనున్నారు.
2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో లక్షా 30వేల డాలర్లు ఫోర్న్ స్టార్ స్మార్టీ డేనియల్స్ కు ట్రంప్ చెల్లించారు. లైంగిక సంబంధం గురించి మౌనంగా ఉండేందుకు డబ్బు చెల్లించారని నటి డేనియల్స్ చెప్పారు. కాగా డేనియల్స్ తో అలాంటి లైంగిక సంబంధం లేదని ట్రంప్ ఖండించారు. నేరారోపణలపై ట్రంప్ కోర్టులో లొంగిపోయిన నేపథ్యంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యే అవకాశం ఉన్నందున స్థానిక మరియు రాష్ట్ర పోలీసు ఏజెన్సీలను ఎఫ్ బీ ఐ హెచ్చరించింది. న్యూయార్క్ నగరంలోనూ అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు.
Pawan Kalyan: పొత్తులతో ప్రయాణంపై జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు