తృణమూల్ కాంగ్రెస్ @ 21

తృణమూల్ ఆవిర్బవించి నేటికి సరిగ్గా 21 ఏళ్లు. తృణమూల్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ వ్యవస్థాపకురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  పార్టీ నాయకులు, కార్యకర్తలకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ సరిగ్గా 21 ఏళ్ల కిందట జనవరి 1 1998న ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి ఎన్నో పోరాటాలు చేసిందనీ, ఎన్ని ఇబ్బందులు, కష్టాలు ఎదురైనా ప్రజల పక్షాన పోరాటంలో పార్టీ ఎన్నడూ రాజీపడలేదని మమతా బెనర్జీ ట్వీట్ చేశారు.పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తృణమూల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను చేపట్టారు.