మాటల మాంత్రూకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటి వరకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేసే అవకాశం దక్కలేదు. పవర్ స్టార్ తో 3 సినిమాలు, అల్లు అర్జున్ తో 3 సినిమాలు మహేష్ బాబు తో 2 సినిమాలు నితిన్ తో ఒక సినిమా. ఎన్.టి.ఆర్ తో ఒక సినిమా చేశాడు. కాని చరణ్ తో సినిమా మాత్రం సెట్ అవలేదు. అయితే ఈ కాంబినేషన్ మీద మాత్రం మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
కాగా ప్రస్తుతం త్రివిక్రమ్ – చరణ్ కాంబినేషన్ లో ప్రాజెక్ట్ సెట్ అయిందన్న టాక్ మొదలైంది. మెగాస్టార్ కి త్రివిక్రమ్ ఇప్పటికే ఒక ఇంట్రస్టింగ్ లైన్ చెప్పాడట. త్రివిక్రమ్ – మెగాస్టార్ కాంబినేషన్ లో కూడా ఒక ప్రాజెక్ట్ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ ఒక సినిమా చేయబోతున్నాడు. 2021 ప్రథమార్థంలో ఈ సినిమా మొదలబోతుంది. అయితే ఈ సినిమ తరువాత త్రివిక్రమ్.. మహేష్ బాబుతో సినిమాని ప్లాన్ చేసుకున్నాడు. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్, చరణ్ తో కూడా ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడని సమాచారం.
ప్రస్తుతం మహేష్ సినిమా మీద త్రివిక్రమ్ వర్క్ చేస్తున్నాడట. పక్కా కమర్షియల్ గా ఈ సినిమాగా తెరకెక్కించేందుకు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ – చరణ్ కాంబినేషన్ లో కూడా ఒక ప్రాజెక్ట్ దాదాపు ఫైనల్ అయిందని అంటున్నారు. అలాగే ఇటీవల బండ్ల గణేష్ నిర్మాతగా పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా ని ప్రకటించారు. ఈ సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తాడని అంటున్నారు. ఇలా ముగ్గురు మెగా హీరోల ప్రాజెక్ట్స్ తో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక ప్రాజెక్ట్, ఎన్.టి.ఆర్ ఒక ఇప్పటికే ఒక సినిమా చేస్తూ త్రివిక్రమ్ సంచలనం సృష్ఠిస్తున్నాడని చెప్పుకుంటున్నారు. మొత్తానికి ప్రభాస్ ఆదిపురుష్ కి వస్తున్నటువంటి క్రేజ్ త్రివిక్రం ప్లాన్ చేస్తున్న ప్రాజెక్ట్స్ వస్తుందని చెప్పుకుంటున్నారు.