భారతీయ సంస్కృతికి మహోన్నత చిహ్నం చేనేత… దీని వెనుక పెద్ద చరిత్ర దాగి ఉంది. పత్తి విత్తిన దగ్గర నుంచి.. వస్త్రానికి వన్నెలద్దే వరకూ ప్రతి ప్రక్రియ ఎంతో సున్నితంగా జరుగుతుంది.మొన్న ‘రాజకీయ’ వస్త్రంగా ఉన్న ఖాదీ నేడు ఆధునిక ఫ్యాషన్ రూపుదాల్చింది. ఒక వైపు తన హుందాతనాన్ని ఏ మాత్రమూ వదులుకోకుండా యువ హృదయాలను కట్టిపడేస్తుంది.
చలిలో వెచ్చగా,ఎండల్లో చల్లగా, కాలానికి అనుగుణంగా ఇమిడిపోయింది చేనేత వస్త్రం.గతకాలం కంటే ఇప్పుడే ఖాదీ వస్త్రాలు మంచి ఆదరణ పొందుతున్నాయి . చేనేత వస్త్రం ప్రశాంతతకు,హుందాతనం కి చిహ్నంగా భావిస్తారు.. వీటి లో రంగులు కూడా సహజమైనవి కావడం వలన కంటికి ఇంపుగా ఉంటాయి.
ప్రస్తుత కాలంలో చేనేత సొగసును యూత్ నుంచి పెద్ద వయసు వారు వరకు ఇష్టపడుతున్నారు. చేనేత తో డిజైనర్స్ ఎన్నో కొత్త కొత్త రూపకల్పన లు చేసి చూపిస్తున్నారు.
అయితే.. వీటితో సమానంగా నకిలీ చేనేత కూడా మార్కెట్లోకి వచ్చేసింది . నకిలీల మధ్య సరైన చేనేతను గుర్తించడం కొంచెం కష్టమే.. అందుకే ప్రముఖ డిజైనర్స్ మంచి చేనేత ని కనిపెట్టడానికి కొన్ని సలహాలు ఇస్తున్నారు…అవేంటంటే
చేనేత వస్త్రాల లో ఖచ్చితంగా కనిపించే లోపాలు.. కనిపించే డిజైన్స్ చీర మొత్తం ఒకేలా ఉండవంటున్నఉండవని డిజైనర్స్ తెలియచేస్తున్నారు.
ప్రతి చేనేత చీర మీద ఓ అందమైన పెయింటింగ్, శిల్పం వంటి వర్క్ ఉంటుంది..
చేనేత వస్త్రాల్లో ఉండే డిజైన్.. ఇంకా చెప్పాలంటే పల్లు భాగాన్ని తిప్పి చూస్తే అద్దంలో చూసినట్లుగా ఉంటుంది.
ఎంబ్రాయిడరీ మిషన్ మీద శారీస్ కి చేసే వర్క్ రఫ్‌గా ఉంటే.. చేతితో చేసిన వర్క్ నీట్‌గా.. తాకినప్పుడు మెత్తగా ఉంటుంది.
మెషిన్‌పై చేసిన ఎంబ్రాయిడరీ… దారాలు లాగినట్లుగా.. లేదా వదులుగా ఉండి ఆ వస్త్రాలను కట్టుకున్నప్పుడు అసౌకర్యంగా ఉంటుంది.
పవర్లూమ్ శారీస్ నీట్‌గా ఐరన్ చేసి పేపర్‌తో కలిపి మడతలు పెట్టి ఉంటాయి..
ఈ చీర కొంగు భాగమే కాకుండా,చీర మొత్తం డిజైన్స్‌తో నిండి ఉంటాయి.కాబట్టి చేనేత వస్త్రాలు కొనుక్కునేటప్పుడు జాగ్రత్తగా ఎంపిక చేసుకోండి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?