ఒక సినిమాని ప్రమోట్ చేయడంలో .. మార్కెట్ చేయడంలో దిల్ రాజు దిట్ట. ఈ కారణంగానే హ్యాపీడేస్ లాంటి సినిమా దిల్ రాజు భారీ సక్సస్ అవడానికి కారణమయ్యాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి దిల్ రాజు కలిశాకే భారీ స్థాయిలో బిజినెస్ జరిగింది. బారీ సక్సస్ అందుకుంది. అలాంటి చాలా సినిమాలని దిల్ రాజు ప్రమోట్ చేయడం తెలిసిందే. ఇక ఆయన నిర్మాణంలో వస్తున్న సినిమాల ప్రమోషన్స్ అన్ని ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలో జనాలలోకి తీసుకు వస్తుంటాడు.
డిస్ట్రిబ్యూటర్స్ కి దిల్ రాజు ఎప్పుడు అండగా ఉంటాడు. ఒక సినిమా లాస్ అయినా మీకు నేనున్నా అంటూ భరోసా ఇస్తుంటాడు. స్వతాహాగా డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు అందరి కష్టాలను పంచుకుంటుంటాడు. కాగా ఎంతో ఫాషన్ తో పవర్ స్టార్ మీద అభిమానంతో తన కలని నేరవేర్చుకున్నాడు. టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా వెలుగుతున్న దిల్ రాజు పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ఎంతగానో తపించాడు.
ఎట్టకేలకి ఆ కోరిక వకీల్ సాబ్ తో తీర్చుకున్నాడు. ప్రస్తుతం పవర్ స్టార్ రీ ఎంట్రీ మూవీగా దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా టాకీపార్ట్ దాదాపు కంప్లీటయింది. దాంతో ఇక ప్రమోషన్స్ మొదలు పెట్టాలని దిల్ రాజు కి పవన్ కళ్యాణ్ సూచించాడట. అంతేకాదు ఈ సినిమా జనాలలోకి దూసుకు వెళ్ళేలా ప్రమోషన్స్ ఉండాలని అందుకు తగ్గట్టుగా వరసగా ఎప్పటికపూడు కొత్త రకమైన పోస్టర్స్ ని రిలీజ్ చేయమని సూచించాడట.
అంతేకాదు ఈ సినిమా నుంచి టీజర్ ని దసర పండగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇక లిరికల్ సాంగ్స్ ని ఒక్కొక్కటిగా వదలబోతున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాతో కొత్త రికార్డ్స్ క్రియోటవ్వాలని అటు పవర్ స్టార్ ఇటు నిర్మాత దిల్ రాజు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. అన్ని కుదిరితే సంక్రాంతి సందర్భంగా వకీల్ సాబ్ ని రిలీజ్ చేయాలని చూస్తున్నారట.