NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

TS Minister Harish Rao: ఆ కేంద్ర మంత్రిపై తెలంగాణ మంత్రి హరీష్ రావు సీరియస్ కామెంట్స్

TS Minister Harish Rao: తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కలిసేందుకు టీఆర్ఎస్ మంత్రుల బృందం ఢిల్లీకి వెళితే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకపోగా మీకు ఏమీ పని లేదా అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై తెలంగాణ మంత్రి హరీష్ సీరియస్ గా స్పందించారు. కేంద్ర మంత్రిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని అన్నారు. ఆయన కేంద్ర మంత్రిగా కాకుండా రాజకీయ నేతగా మాట్లాడారని హరీష్ విమర్శించారు. రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల పక్షాన రాష్ట్ర మంత్రులు ఢిల్లీకి వెళితే అవమానించేలా వ్యాఖ్యలు చేయడం రైతు కుటుంబాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేననీ, ఇది తెలంగాణ ప్రజానీకాన్ని అవమానించడమేనన్నారు. తక్షణం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

TS Minister Harish Rao serious comments on central minister Piyush Goyal
TS Minister Harish Rao serious comments on central minister Piyush Goyal

TS Minister Harish Rao: పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలి

రైతు ప్రయోజనాల కోసం ఢిల్లీకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ బృందానికి సమయం లేదని చెప్పిన కేంద్ర మంత్రికి తెలంగాణ బీజేపీ నేతలను కలిసేందుకు సమయం ఉందా అని ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తేనే వారి ప్రాధాన్యత ఏమిటో అర్ధం అవుతుందని అన్నారు. తమ ప్రాధాన్యత రైతుల సంక్షేమం అయితే వారి ప్రాధాన్యత రాజకీయమని విమర్శించారు. బీజేపీకి రైతుల ఓట్లు కావాలి కానీ వారు పండించిన వడ్లు అవసరం లేదని అన్నారు. పంజాబ్ మాదిరిగా తెలంగాణలోనూ పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్నామన్నారు. ధాన్యం కొనుగోలు అంశం కేంద్ర పరిధిలోనిది. వాళ్ల బాధ్యత వారు నెరవేర్చాలన్నారు రాష్ట్ర పరిధిలోని అంశాలను రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందన్నారు. రైతుల కోసం ఉచిత విద్యుత్, రైతు బంధు అమలు చేస్తున్నామని చెప్పారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి పూర్తిగా అబద్దాలు మాట్లాడారని ఆరోపించారు వడ్లు ఇస్తామనీ, గోడౌన్ల సామర్థ్యం పెంచాలని పది సార్లు లేఖలు రాస్తే లేఖలు రాయలేదని కేంద్ర మంత్రి చెప్పడాన్ని హరీష్ రావు తప్పుబట్టారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!