TSPSC Group 1 Postponed: కొన్ని సంవత్సరాలుగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 రిక్రూట్మెంట్ ఆగిపోయిన విషయం అందరికి తెలిసిందే. రాక రాక ఉద్యోగ అవకాశాలు వొచ్చాయి అని 2022 లో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల అయిన తరువాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు చాలా ఆనందించారు. పరీక్ష రాసి ఫలితాలు కూడా వొచ్చేసరికి హమ్మయ్య అనుకున్నారు, కానీ అందరి ఆశలు నీరుగారుస్తూ గ్రూప్ 1 పేపర్ లీక్ వార్త రాష్ట్రమంతా సంచలనం సృష్టించింది. ఆ తరువాత గ్రూప్ 1 పరీక్షను రద్దు చేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. పేపర్ లీక్ కారణంగా గ్రూప్ 1 పరీక్షను తిరిగి జూన్ 11 2023న నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ షార్ట్ నోటిఫికేషన్ ధ్వారా అభ్యర్థులకు తెలియచేసింది. కానీ అన్నీ అనుకున్నట్లు జరిగితే జీవితం లో ఇన్ని కష్టాలు ఎందుకు ఉంటాయి చెప్పండి, జూన్ 11న పరీక్ష ఎలా నిర్వహిస్తారు అది సబబు కాదు మాకు ఇంకా సమయం కావలి అంటూ 36 మంది గ్రూప్ 1 అభ్యర్థులు తెలంగాణ హై కోర్టును ఆశ్రయించారు. మే 25న దీనికి సంబందించిన పిటిషన్ హై కోర్టు విన్నది, ఇప్పుడు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష వాయిదా వెయ్యాలా వొద్దా అన్నది హై కోర్టు ముందు ఉన్న ప్రధాన ప్రశ్న.
Latest Update: టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష వాయిదాకు నిరాకరించిన తెలంగాణ హై కోర్టు…గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షల మధ్య ఉండవలసిన వ్యవధి గురించి టీఎస్పీఎస్సీ నుంచి వివరణ కోరిన జస్టిస్ పుల్లా కార్తీక్

TSPSC Group 1: టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష తో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలు కూడా అనుకూలంగా వాయిదా వెయ్యాలి అనేది ఈ అభ్యర్థుల పిటిషన్. దేనికోసం జరగబోయే పరీక్షల మీద స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వు జారీ చేయాలని హై కోర్టును ఆశ్రయించారు.
అయితే ఈ రోజు హై కోర్టులో జస్టిస్ కే లక్ష్మణ్ దేనికి సంబందించిన విచారణ జరపాల్సి ఉంది…కానీ కేసు వివరాలు పరిశీలించిన జస్టిస్ కే లక్ష్మణ్ విచారణను ముందుకు వెళ్ళడానికి అభ్యన్తరం వ్యక్తం చేసారు. కాన్ఫ్లిక్ట్ అఫ్ ఇంటరెస్ట్ కింద ఈ కేసును మరో న్యాయవాది బెంచ్ కు పంపుతున్నట్లు పేర్కొన్నారు. దీనికి కారణం జస్టిస్ కే లక్ష్మణ్ కూతురు, తన కూతురు కూడా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పరీక్షకు సిద్దమవుతున్నట్లు ఇలాంటి పరిస్తిథిలో తాను ఈ పిటిషన్ పైన విచారణ జరపడం సబబు కాదు అని జస్టిస్ కే లక్ష్మణ్ తనంతట తానే పక్కకు తప్పుకోవడం గమనార్హం.
TSPSC Current Affairs PDF | FREE Download TSPSC Current Affairs Magazine PDF Part 1
అయితే కోర్టు దెగ్గర ఈ పిటిషన్ ను క్షున్నంగా పరిశీలించిన కొంత మంది నిపుణులు మాత్రం ఎట్టి పరిస్థులలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష వాయిదా పడదు అని అభిప్రాయం వ్యక్తం చేసారు. పిటిషన్ వేసిన అభ్యర్థుల అభ్యర్ధన ప్రకారం, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 , గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలకు మధ్యలో కనీసం రెండు నెలలు అయినా సమయం ఉండాలి అని లేకపోతే ఇన్ని సంవత్సరాల తరువాత వొచ్చిన పరీక్షలకు సరిగ్గా చదువుకునే అవకాశం లేకుండా పోతుంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి దీనికి సంబంధించిన తుది నిర్ణయం కోర్టు నుంచి ఇంకా రాలేదు, త్వరలోనే పూర్తి జడ్జిమెంట్ బయటకు రానుంది. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 వాయిదా అయితే ఇంకా జరగలేదు కాబట్టి పరీక్షకు చదువుకునే అభ్యర్థులు ఈ వార్తలు పట్టించుకోకుండా చదువుకోవాలని కోచింగ్ సెంటర్ నిపుణులు చెప్తున్నారు. ఒకవేళ పరీక్ష వాయిదా అయితే నష్టం లేదు మీకు ఎక్కువ సమయం వస్తుంది, కానీ వాయిదా పడుతుంది అని చదవడం మానేస్తే మాత్రం జూన్ 11న పరీక్ష జరిగినప్పుడు బాధ పడక తప్పదు అన్నది వీరి వాదన. త్వరలో తెలంగాణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 వాయిదా పడితే ఎన్నికల కోడ్ అమలు లోకి వొచ్చి అభ్యర్థులకు ఇంకా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది.
Latest Update: టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష వాయిదాకు నిరాకరించిన తెలంగాణ హై కోర్టు…గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షల మధ్య ఉండవలసిన వ్యవధి గురించి టీఎస్పీఎస్సీ నుంచి వివరణ కోరిన జస్టిస్ పుల్లా కార్తీక్
TSPSC Current Affairs PDF | FREE Download TSPSC Current Affairs Magazine PDF Part 1
YCP Vs TDP: అయ్యన్న వ్యాఖ్యల దుమారం..! జోగి రమేష్ ఆందోళనతో చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత..!!