NewsOrbit
న్యూస్

కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్‌తో టీటీడీ చైర్మన్ వైవీ భేటీ..! కీలక విషయంపై వినతి..! ఎమిటంటే..?

 

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నేతృత్వంలో వేద విద్యావ్యాప్తి, పరిరక్షణ కోసం 2006లో శ్రీ వెంకటేశ్వర వేద విశ్వ విద్యాలయాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. 2007లో యూజీసీ దీన్నిరాష్ట్ర విశ్వ విద్యాలయంగా గుర్తించింది. ఈ వర్శిటీ వేదాల్లో డిగ్రీ నుండి పిజీ వరకూ అనేక కోర్సులను నడుపుతోంది. సనాతన సంప్రదాయమైన వేద విద్యను ప్రోత్సహించడానికి టీటీడీ సొంతంగా వేద పాఠశాలలను నడపడంతో పాటు దేశ వ్యాప్తంగా 80 వేద గురుకులాలకు ఆర్థిక తోడ్పాటు కూడా అందిస్తున్నది. వేదం చదివిన వారిని ఆదుకునేందుకు ఆలయాల్లో వేద పారాయణం, పెన్షన్ అగ్నిహోత్రం ఆర్థిక పథకాలను టీటీడీ అమలు చేస్తున్నది.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం మూడు విద్యాసంస్థలకు జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయాల హోదా ఇచ్చిన నేపథ్యంలో టీడీపీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయ ప్రతిపాదనను కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ రమేష్ ఫోఖ్రియాల్‌ దృష్టికి తీసుకువెళ్లారు. ఢిల్లీలో బుధవారం కేంద్ర మంత్రి రమేష్‌ను కలిసిన వైవీ సుబ్బారెడ్డి శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయాన్ని జాతీయ వేద విశ్వ విద్యాలయంగా ప్రకటించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఒక వినతి పత్రాన్ని అందించారు. ఎస్వీ విశ్వ విద్యాలయానికి జాతీయ హోదా ప్రకటిస్తే దేశంలో తొలి వేద విశ్వ విద్యాలయంగా గుర్తింపు పొంది దేశ వ్యాప్తంగా వేద విద్యా వ్యాప్తికి తోడ్పాటు కలుగుతుందన్నారు వైవీ.

అదే విధంగా 14 సంవత్సరాలుగా ఎస్వీ విశ్వ విద్యాలయానికి యూజీసి 2 ఎఫ్ గుర్తింపు ఇచ్చిందనీ, ఇప్పుడు 12 బీ కెటగిరీ గుర్తింపు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు.  ఏపి ప్రభుత్వం టీటీడీ ద్వారా వేద విద్య ఉన్నతికి కట్టుబడి ఉందని వైవీ మంత్రికి విన్నవించారు.  అదే విధంగా ఢిల్లీలో టీటీడీ నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర కాలేజీలో తెలుగు, తమిళం, సంస్కృతం విభాగాల్లోని సీట్లలో టీటీడీ కోటాను పునరుద్ధరించాలని వైవీ సుబ్బారెడ్డి మంత్రికి మరో వినతి పత్రాన్ని అందించారు. 2016 ముందు వరకూ అమలు అయిన ఈ కోటాను ఆ తరువాత ఢిల్లీ యూనివర్శిటీ అనుమతించడం లేదని అన్నారు. 1961లో ఉప రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ శంకుస్థాపన చేసిన ఈ కళాశాలకు ఢిల్లీలో ప్రతిష్టాత్మక కళాశాలల్లో ఒకటిగా టీటీడీ తీర్దిదిద్దిందని గుర్తు చేశారు వైవీ సుబ్బారెడ్డి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?