NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

TTD: టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన పోలీసులు..! 107 మందిపై కేసులు నమోదు..!!

TTD: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేస్తున్న టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు పోలీసులు షాక్ ఇచ్చారు. తమకు జీతాలు పెంచాలని, తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ గత 12 రోజులుగా తిరుపతి టీటీడీ పరిపాలనా భవనం వద్ద కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆందోళన చేస్తుండగా ఆందోళన నిలిపివేయాలని అలిపిరి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయినా వీరు తమ ఆందోళన కొనసాగిస్తున్న నేపథ్యంలో 107 మంది పై కేసులు నమోదు చేశారు.

TTD: ఈవో జవహర్ రెడ్డి పై కార్మికుల సంచలన వ్యాఖ్యలు

టీటీడీ ఈవో జవహర్ రెడ్డి గురువారం కార్మికులను చర్చలకు పిలిచారు. అయితే కార్మికులతో జరిగిన చర్చలు విఫలమైనట్లు తెలుస్తోంది. ఆ సమావేశం అనంతరం కార్మికులు సంచలన వ్యాఖ్యలు చేశారు. చర్చల పేరుతో తమను పిలిచి బెదిరింపులకు దిగారని కార్మికులు ఆరోపించారు. కాంట్రాక్ట్ వ్యవస్థలో లోపాలు, సమస్యలను పరిష్కరించకుండా తమ పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. నిన్న ఆందోళన చేస్తున్న కార్మికులను పోలీసులు బలవంతంగా స్టేషన్ కు తీసుకువెళ్లారు. వీరి ఆందోళనకు మద్దుతుగా నిలుస్తున్న సీఐటీయు నాయకులను గృహ నిర్బంధం చేసినట్లు వార్తలు వచ్చాయి. రెండు రోజుల క్రితం టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై జనసేన స్పందించింది. వీరి ఆందోళనకు సంఘీభావం తెలియజేస్తున్నట్లు జనసేన ప్రకటించింది. వారి సమస్యలపై టీటీడీ సానుకూలంగా స్పందించకపోతే జనసేన కాంట్రాక్ట్ కార్మికులకు అండగా నిలుస్తుందని పేర్కొంది.

కాగా జూన్ నెలలో జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే అంశంపై చర్చించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్లి వాళ్ల ఉద్యోగాలను పర్మినెంట్ చేసే విషయంపై ఓ నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. కానీ ఇంత వరకూ తదనుగుణంగా చర్యలు తీసుకోకపోవడంతో వీళ్లు ఆందోళన బాట పట్టారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju