NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

సామాన్య భక్తులకు ఊరట కల్గించేలా టీటీడీ కీలక నిర్ణయాలు

సాధారణ భక్తులకు ఊరట కల్గించేలా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో వీవీఐపీ, వీఐపీలు వేకువ జామున శ్రీవారి దర్శనానికి అవకాశం లేదు. వీఐపీ బ్రేక్ దర్శనాల సమయాన్ని మార్పు చేస్తూ టీటీడీ నిర్ణయాన్ని తీసుకుంది. డిసెంబర్ ఒకటవ తేదీ నుండి వీఐపీ బ్రేక్ దర్శనాన్ని ఉదయం 8.30 గంటల నుండి ప్రారంభిస్తూ నిర్ణయం తీసుకుంది టీటీడీ. ఈ మేరకు తీసుకున్న నిర్ణయాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు.

Tirumala

 

ప్రతి రోజు వేకువ జాము 5 గంటలకు మొదలయ్యే వీఐపీ బ్రేక్ దర్శనం ఉదయం 8.30 గంటల నుండి ప్రారంభమవుతుందని చైర్మన్ తెలిపారు. రాత్రి నుండి సర్వదర్శనంలో క్యూలైన్ లో ఉన్న భక్తులకు ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయాల మార్పు అంశంపై పరిశీలన చేస్తున్నామని కొద్ది రోజుల క్రితం ఇఓ ధర్మారెడ్డి మీడియాకు చెప్పారు. వీఐపీ బ్రెక్ దర్శనాలను ఉదయం 5 గంటల నుండే ప్రారంభిస్తుండటంతో రాత్రి వేళ సర్వదర్శనం క్యూలైన్లలో వేచి ఉండే భక్తులు ఇబ్బంది పడుతున్నారన్నారన్నారు. రాత్రి వేచి ఉన్న భక్తులు ఉదయం 8.30 గంటల లోపు దర్శనం అయ్యేలా చూస్తామని అన్నారు.

కళ్యాణోత్సవం టికెట్లు తీసుకున్న వారికి ఇబ్బంది లేకుండా ఈ చర్యలు చేపట్టామని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. నవంబర్ 1 నుండి సర్వదర్శనం టోకెన్ల ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఇదే సమయంలో టీటీడీ ఉద్యోగాలకు సంబందించిన కీలక నిర్ణయాలను తెలిపారు వైవీ. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను కేటాయించామని చెప్పిన ఆయన.. తిరుమలలో పని చేస్తున్న ఉద్యోగులకు ఎలక్ట్రిక్ బైక్ లపై రాయితీలు ఇస్తామని చెప్పారు.

కాగా సర్వదర్శనం టోకెన్ల జారీ పై టీటీడీ ఇఓ ధర్మారెడ్డి వివరాలను వెల్లడించారు. తిరుపతిలోని శ్రీనివాసం, గోవిందరాజు, భూదేవి సత్రాల్లో నవంబర్ 1 నుండి ఈ టోకెన్ల జారీ ఉంటుందని చెప్పారు. రోజువారీ కోటా చొప్పున టోకెన్లు జారీ చేస్తామని ఆయన తెలిపారు. సోమ, బుధ, శని, ఆదివారాల్లో 20వేల నుండి 25వేల టోకెన్లు జారీ చేస్తామనీ, మంగళ, గురు, శుక్ర వారాల్లో 15 వేల చొప్పున టోకెన్లు జారీ చేస్తామని ఇఓ ధర్మారెడ్డి తెలిపారు.

YS Jagan: ఆ ప్రాంత ప్రజలకు ఇచ్చిన ఆ హామీని నెరవేర్చిన ఏపీ సీఎం వైఎస్ జగన్

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!