ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్ సినిమా

టీటీడీ పై సినీ నటి అర్చన గౌతమ్ చేసిన ఆరోపణల వీడియో వైరల్.. ఆరోపణలపై టీటీడీ ఇచ్చిన క్లారిటీ ఇదీ

Share

యూపీకి చెందిన సినీ నటి అర్చన గౌతమ్ తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేశారు. అయితే తాను తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసిన సందర్భంలో టీటీడీ సిబ్బంది అనుచితంగా ప్రవర్తించి తనపై దాడి చేశారనీ, వీఐపీ దర్శనం పేరుతో రూ.10,500లు వసూలు చేస్తున్నారని, ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటూ డిమాండ్ చేశారు. తాను డబ్బులు చెల్లించినా గానీ రసీదు ఇచ్చి టోకెన్ ఇవ్వలేదని ఆరోపించడంతో పాటు దర్శన టోకెన్ కోసం ప్రశ్నిస్తే టీటీడీ సిబ్బంది తనపై దాడి చేసేందుకు ప్రయత్నించారని కన్నీటి పర్యంతం అవుతూ ఓ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేశారు అర్చన గౌతమ్. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఈ ఘటనపై టీటీడీ స్పందించింది. జరిగిన ఘటనపై పూర్తి వివరాలను వెల్లడించింది టీటీడీ.

UP Actress archana gautam selfie video

 

టీటీడీ ఇచ్చిన వివరణ ఈ విధంగా ఉంది. ఉత్త‌రప్ర‌దేశ్‌కు చెందిన శివ‌కాంత్ తివారి, న‌టి అర్చ‌నా గౌత‌మ్‌తో పాటు మ‌రో ఏడుగురికి గత నెల 31న శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం కేంద్ర స‌హాయమంత్రి నుంచి సిఫార‌సు లేఖ‌ను తీసుకుని తిరుమ‌ల‌కు వ‌చ్చి అద‌న‌పు ఈవో కార్యాల‌యంలో ద‌ర్శ‌నం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారన్నారన్నారు. ఈ లేఖపై రూ.300ల ద‌ర్శ‌నం టికెట్లు మంజూరు చేస్తూ శివ‌కాంత్ తివారీకి చెందిన 9454607006 మొబైల్ నంబ‌రుకు మెసేజ్ పంపడం జరిగిందన్నారు. అయితే వారు ఈ అవ‌కాశాన్ని ఉప‌యోగించుకోలేదనీ అటు త‌రువాత శ్రీ శివ‌కాంత్ తివారి అద‌న‌పు ఈవో కార్యాల‌యానికి వెళ్లగా అప్ప‌టికే టికెట్లు తీసుకోవాల్సిన గ‌డువు ముగిసిందని వారు తెలిపారన్నారు.

 

శివ‌కాంత్ తివారితో పాటు అద‌న‌పు ఈవో కార్యాల‌యంలోకి చొచ్చుకుని వ‌చ్చిన న‌టి అర్చ‌నా గౌత‌మ్ ఆగ్ర‌హంతో విచ‌క్ష‌ణ కోల్పోయి కార్యాల‌య సిబ్బందిని దుర్భాష‌లాడారనీ, స‌ర్ది చెప్ప‌బోయిన ఒక ఉద్యోగిపై చేయి చేసుకున్నాని పేర్కొన్నారు. తివారి ఆమె చేస్తున్న యాగీని చూస్తూ ఉరుకున్నారు త‌ప్ప ఆమెను వారించే ప్ర‌య‌త్నం చేయ‌లేదనీ, చివ‌ర‌కు ఆద‌న‌పు ఈవో కార్యాల‌య సిబ్బంది వారి వివ‌రాలు తీసుకుని రెండోసారి రూ.300/- టికెట్లు కేటాయించినా తీసుకోవ‌డానికి న‌టి అర్చ‌నా గౌత‌మ్ నిరాక‌రించారన్నారు. అనంత‌రం అక్క‌డి నుండి టు టౌన్ పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి కార్యాల‌య సిబ్బంది త‌న‌పై చేయి చేసుకుని దురుసుగా ప్ర‌వ‌ర్తించార‌ని ఫిర్యాదు చేశారనీ, అద‌న‌పు ఈవో కార్యాల‌య సిబ్బందిని అక్క‌డి సిఐ పిలిపించి విచార‌ణ చేప‌ట్టగా, సిబ్బంది తాము తీసిన వీడియోను సిఐకి చూప‌గా న‌టి దురుసుగా ప్ర‌వ‌ర్తించిన విషయం వెలుగుచూసిందన్నారు. దీంతో న‌టి అర్చన గౌతమ్ వెన‌క్కి త‌గ్గి అక్క‌డినుంచి వెళ్లిపోయారన్నారు.

ఆగ‌స్టు 1వ తేదీకి విఐపి బ్రేక్ ద‌ర్శ‌నం టికెట్ కావాలంటే రూ.10,500లు చెల్లించి శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ పొందొచ్చ‌ని మాత్ర‌మే సిబ్బంది స‌ల‌హా ఇచ్చారనీ, వాస్త‌వాలు ఇలా ఉండ‌గా అద‌న‌పు ఈవో కార్యాల‌య సిబ్బంది ద‌ర్శ‌నం టికెట్ కోసం రూ.10 వేలు డిమాండ్ చేశార‌ని స‌ద‌రు వీడియోలో న‌టి ఆరోపించడం సత్యదూరమన్నారు. తాను సెల‌బ్రిటీ అయినందువ‌ల్ల ఏమి చెప్పినా భ‌క్తులు న‌మ్ముతార‌నే అభిప్రాయంతో న‌టి అర్చ‌నా గౌత‌మ్ అవాస్త‌వాల‌తో సోష‌ల్ మీడియాలో దుష్ప్ర‌చారం చేస్తున్నారని టీడీడీ పేర్కొంది. భ‌క్తులు ఇలాంటి అవాస్త‌వ ప్ర‌చారాల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని టిటిడి విజ్ఞ‌ప్తి చేసింది.


Share

Related posts

‘రాజీవే అవినీతిని ఒప్పుకున్నారు’

somaraju sharma

కరోనా కి విరుగుడని కషాయం అలా తాగితే మొదటికే మోసం…!

arun kanna

ఆ ఒక్క విషయంలో జగన్ సర్కార్ పై నెగిటివిటీ..!!

sekhar