NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

మలుపులు తిరుగుతున్న అమెరికా ఫలితం..!

 

ఉత్కంఠ భరితంగా సాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపులో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడన్ మాజిక్ ఫిగర్‌కు ఆరు అడుగుల దూరం (ఆరు ఓట్లు)లో ఉన్నారు. బైడెన్ ఇప్పటికే 264 ఎలక్ట్రోరల్ ఓట్లు సాధించగా అధ్యక్షుడు, రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్‌నకు 214 ఓట్లు మాత్రమే లభించాయి. జో బైడన్ మరో రికార్డును సాధించనున్నారు. భారీ ఓట్లను పొందిన అభ్యర్థిగా బైడన్ నిలువనున్నారు. ఇప్పటికే బైడెన్‌కు 7.19కోట్ల ఎలక్ట్రోలర్ ఓట్లు లభించాయి. ట్రంప్ ‌కేవలం 6.85కోట్ల ఓట్లు మాత్రమే సాధించారు. ఇంకా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బైడన్‌కు ఇంకా పాపులర్ ఓట్లు పెరిగే అవకాశం ఉంది.

మిషిగన్ (16)లో బైడెన్ విజయం సాధించారు. కాగా మిషిగన్ ఎన్నికల ఫలితాలపై అధ్యక్షుడు ట్రంప్ అక్కడి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓటింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని రిపబ్లికన్  ప్రచార బృందం పిటిషన్‌లో పేర్కొంది. పలు కీలక రాష్ట్రాలకు చెందిన ఓట్ల లెక్కింపు మధ్యాహ్నానికి పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు లెక్కింపు జరిగే రాష్ట్రాల్లో మెజార్టీ సాధిస్తే ట్రంప్ గెలుపొందే అవకాశాలు ఉన్నాయి.

అగ్రరాజ్యం అమెరికాలో ఓట్ల లెక్కింపుపై యావత్ ప్రపంచం ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా బైడన్ విజయానికి చేరువలో ఉన్నారు. అయితే ఎన్నికల తీరుపై సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు ట్రంప్ ప్రకటించగా, బైడెన్ కూడా న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. ఒక వేళ కోర్టుకు వెళితే ఫలితం మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju