TV 9: ఇక జగన్ సొంతం..!? అత్యధిక వాటాలు కొనేస్తున్న జగతి మీడియా..!?

Share

TV 9:  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రాజకీయ ఎత్తుగడలు ఎప్పుడు ఏ విధంగా ఉంటాయో ఎవరికీ అర్థం కాదు. రాష్ట్రంలో గానీ జాతీయ స్థాయిలో గానీ జగన్ వ్యూహాలు ఎలా ఉంటాయి అనేది ఊహించడం కొంత కష్టమే. అది స్ట్రాటజికల్ గా కావచ్చు, ఎదుటి వారిని దెబ్బతీసేందుకు కావచ్చు..ఎదుటి వారిని బలహీనపర్చడాని కావచ్చు రకరకాలుగా రాజకీయంగా కావచ్చు, మీడియా పరంగా కావచ్చు రకరకాల వ్యూహాలు వేస్తుంటారు. ఇప్పుడు దీనిలో భాగంగా ఆయన మీడియాలో మరో సంచనల అడుగు దిశగా పయనిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. జగన్మోహనరెడ్డి గారికి ప్రస్తుతం సాక్షి మీడియా ఉంది. జగతి పబ్లికేషన్ పేరుతో సాక్షి పత్రికను, సాక్షి టీవీని తెలుగు మీడియాలో కాస్త ఏదో ఒక రకంగా ఉన్నత స్థాయిలో నిలబెట్టగలిగారు. వైఎస్ఆర్ ఉన్నప్పుడే 2008 మార్చి 24న సాక్షి పబ్లికేషన్ పత్రిక ప్రారంభం కాగా రెండు సంవత్సరాల తరువాత సాక్షి టీవీ కూడా ప్రారంభించారు. ఆ తరువాత మీడియాలో కొత్త పుంతలు తొక్కించారు. మీడియా కూడా ఒక పార్టీకి కరపత్రంగా మారవచ్చు, భజన చేయవచ్చు, ఒక పార్టీకి భజన పత్రికను మీడియాగా చెప్పుకోవచ్చు అంటే సాక్షిని చూస్తే అర్థం అయ్యింది. ఆ తరువాత దేశ వ్యాప్తంగా, రాష్ట్రంలోనూ కొన్ని పత్రికలు తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాయడం మొదలు పెట్టాయి. దేశ వ్యాప్తంగా కూడా రిపబ్లిక్ టీవీ అంటే ఒక పార్టీకి, ఆజ్ తక్ అంటే ఒక పార్టీకి ఇలా ఒక్కో మీడియా ఒకొక్క పార్టీ అలా అయిపోయింది. దేశం మొత్తం మీడియా అలా అయిపోయింది.

TV 9 likely to take over jagati publications
TV 9 likely to take over jagati publications

Read More: PAVAN KALYAN: పాత పొత్తు కొత్త ఎత్తు.. పవన్ కళ్యాణ్ మాటలు విన్నారా..!?

TV 9:  ప్రజాదరణ కల్గిన ఛానల్ టీవి 9

ఇప్పుడు తాజా వార్త ఏమిటంటే.. జగన్మోహనరెడ్డి గారు మరో కీలకమైన మీడియా సంస్థను కొనుగోలు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో టీఆర్‌పీ రేటింగ్ లో టాప్ లో ఉంది. మీడియా పరంగా విలువలు లేవు. వార్తల ప్రజెంటేషన్ పరంగా విలువలు లేవు. సోషల్ మీడియాలో విపరీతంగా తిట్లు తింటున్న ఛానల్ ఏదైనా ఉంది అంటే అది టీవీ 9. జనాలు తిట్టుకునే, అసహించుకునే ఛానల్ ఏదైనా ఉంది అంటే టీవీ 9. కానీ టీఆర్పీలో ఎప్పుడూ ముందు ఉంటుంది. అదేమిటంటే అదొక మాయాజాలం. అయితే టీవీ 9కు అయితే ప్రజాదరణ ఉంది. ఆరంభించిన కొత్తలో టీవీ 9 అనేది ఒక నవశకం. 24 గంటల వార్తా స్రవంతిగా తెలుగులో ఆరంభించిన మొదటి ఛానల్ కాబట్టి దానికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. సో.. ఆ టీవీ 9లో అత్యధిక వాటాలు అంటే 51 శాతం జగన్మోహనరెడ్డి గారి సంస్థలు కొనుగోలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీకి సాక్షి మీడియా ఉంది కదా. టీవీ 9 కూడా వైసీపీకి సపోర్టే కదా అని జనాలకు అనుమానం రావచ్చు, అయితే సపోర్టుగా ఉండటం వేరు, సొంతంగా ఉండటం వేరు. సాక్షి సొంతం, టీవీ 9 సపోర్టు, రేపు అధికార పార్టీ మారితే టీవీ 9 అధికార పార్టీకి భజన చేయవచ్చు. అదే సొంత ఛానల్ అయితే అధికారంలోకి ఎవరు వచ్చినా సరే భజన చేయదు, వ్యతిరేకంగానే వ్యవహరిస్తుంది. అదే తేడా. అందుకే ఇప్పుడు టీవీ 9లో అత్యధిక వాటాలు కొనుగోలు చేస్తే పలు రాష్ట్రాల్లోనూ చక్రం తిప్పవచ్చు.

Read More: Janasena x Ysrcp: జగన్ ఇంటికెళ్లి కొడతారట..!? జనసేన X వైసీపీ గొడవ పీక్స్..!?

జాతీయ స్థాయిలో రాజకీయ చక్రం తిప్పేందుకేనా..?

నిజానికి టీవీ 9 రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మరాఠి, హింధీ, ఇలా దేశ వ్యాప్తంగా ఎనిమిది భాషల్లో ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో టీవీ 9 కాస్త పాపులర్ అయ్యింది. అందుకే టీవీ 9 సంస్థను కొనుగోలు చేస్తే దేశ వ్యాప్తంగా కూడా తన మీడియా నెట్ వర్క్ విస్తరించుకున్నట్లు ఉంటుంది. అలానే తాను కూడా దేశ వ్యాప్తంగా యువ నాయకుల్లో కాస్త చరిష్మా ఉన్న నాయకుడు కాబట్టి భవిష్యత్తులో బీజేపీతో ఏమైనా రాజకీయ సంబంధాలు నెరపాలన్నా, లేదా బీజేపీకీ వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ప్రాపకాండ చేయాలన్నా తమ మీడియాతో అది చేయవచ్చు అన్న భావనతో టీవీ 9 కొనుగోలు చేసి దేశ వ్యాప్తంగా విస్తరించడానికి ప్రణాళికలు చేస్తున్నట్లుగా ఒక సమాచారం. దానిలో భాగంగా చర్చలు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం టీవీ 9 మై హోమ్స్ రామేశ్వరరావు చేతిలో ఉంది. ఆయనవే అత్యధిక వాటాలు ఉన్నాయి. ఆయన ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ కు అనుభంధంగా ఉన్నారు.  రిపబ్లిక్ టీవీతో సహా పలు ఛానల్ లు ఇప్పటికే జాతీయ స్థాయిలో బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో రాజకీయంగా చక్రం తిప్పాలంటే టీవీ 9 లాంటి ఛానల్ తమ చేతిలో ఉంటే మంచిదన్న భావనతో జగన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారనీ, ప్రస్తుతం చర్చల దశలో ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్లు షికారు చేస్తున్న క్రమంలోనే టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్న మైహోం రామేశ్వరరావును టీటీడీ బోర్డు డైరెక్టర్ గా జగన్మోహనరెడ్డి ఇటీవల నియమించడంతో ఆ సంప్రదింపులు నిజమేనని భావిస్తున్నారు. ఏదిఏమైనా కొద్ది రోజుల్లో దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


Share

Related posts

పాపం బండ్ల గ‌ణేష్… ఎంత కామెడీ అయిపోతున్నాడో….

sridhar

Flash News: తెలంగాణ మంత్రుల పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఏపీ సీఎం జగన్..!!

P Sekhar

Migraine Headache: మందులేని మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టండిలా..!!

bharani jella