టీవీఎస్ ఎక్సెఎల్ సరికొత్త ఎడిషన్ లాంచ్.. ఫీచర్స్ చూసేయండి..

గ్రామాల్లో రైతుల నేస్తంగా, నిత్యావసరాలకు తరచూ వినియోగించే బండి ఏదైనా ఉందంటే అది టీవీఎస్ ఎక్సెల్ అని చెప్పొచ్చు.. మోపెడ్ మార్కెట్ లో చరిత్ర సృష్టించిన టీవీఎస్ మోటార్.. తాజాగా తన ఎక్సెఎల్ 100 విన్నర్ ఎడిషన్ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది.. TVS XL 100 Winner edition ఆకర్షణీయమైన ఫీచర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

TVS XL 100 Winner edition launch with updated features see the on road price details

ఇంజన్ :
ఈ టీవీఎస్ ఎక్సెఎల్ 100 లో 99.7 సిసి ఎయిర్-కూల్డ్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 4.15 బిహెచ్పిల శక్తిని, 6.5 న్యూటన్ మీటర్ గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. బి ఎస్ ప్రమాణాల కారణంగా కంపెనీ ఫ్యూయల్ ఇంజెక్ట్ ఇంజన్ ను ఉపయోగించారు.

TVS XL 100 Winner edition launch with updated features see the on road price details

ఫీచర్లు :
టీవీఎస్ ఎక్సెఎల్ 100 విన్నర్ ఎడిషన్ స్కూటర్ లో ఇప్పుడు ఇంజన్ కిల్ స్విచ్ కూడా ఉండటంతో మరింత ప్రత్యేకత సంతరించుకుంది. అంతేకాకుండా మొబైల్ ఛార్జింగ్ కోసం యూఎస్బీ సాకెట్ కూడా ఈ టివిఎస్ లో అమర్చారు. ఈ ఎడిషన్ ఇంతకు ముందు మోడల్ కంటే మరింత ఆకర్షణీయంగా, మంచి ఫీచర్స్ ను కలిగి ఉంది. ఈ టీవీఎస్ ఎక్సెల్ లో బ్రౌన్ కలర్ సీట్లు ఏర్పరచారు దీనితోపాటు సైలెన్సర్ పై chromomaffler,  ఫ్యూయల్ ట్యాంక్ కింద ఫుట్ రెస్ట్ లో ఉన్న క్రోమో ప్లేట్ ఇవ్వడంతో ప్రీమియం లుక్ తో మెరిసిపోతుంది.

 

TVS XL 100 Winner edition launch with updated features see the on road price details

టీవీఎస్ ఎక్సెఎల్ 100 విన్నర్ ఎడిషన్ స్కూటర్ వెనుక సీటును తొలగించి లగేజ్ తీసుకెళ్ళడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. టీవీఎస్ ఎక్సెఎల్ 100 నేవీ బ్లూ కలర్ ఆప్షన్ లో లభిస్తుంది. TVS XL 100 Winner షోరూమ్ ధర రూ. 49,599.