NewsOrbit
న్యూస్

గ్రేటర్ ఎన్నికల్లో ఇరవై ఒక్క ఏళ్ల రచనశ్రీ గ్రేట్ అచీవ్మెంట్!

భారతీయ జనతాపార్టీ కార్పొరేటర్గా ఎన్నికైన రచనశ్రీ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్ల అందరిలో అతి పిన్న వయస్కురాలు.కేవలం 21సంవత్సరాలకే ఆమె గ్రేటర్ కార్పొరేటర్గా ఎన్నికయ్యారు.

భారతీయ జనతా పార్టీ అంటే ఆమె తండ్రికి ఎనలేని అభిమానం..తల్లికేమో సుష్మాస్వరాజ్ ఆదర్శప్రాయం.ఇదే రచనశ్రీ ని అందలమెక్కించింది.ఆమె తండ్రి ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త.. చిన్న వ్యాపారం చేసుకుంటూ రాజకీయాల్లో ఉన్నా ఏనాడూ ప్రజాప్రతినిధిగా ఎన్నికవ్వాలన్న ఆశ ఆయనలో ఉండేది కాదు. ఇక తల్లి మనసులో మాత్రం ఒక కోరిక ఉండేది. ముగ్గురు సంతానం ఉన్నా తన పెద్దకూతుర్ని దివంగత కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌లా చూడాలనుకుంది. ఆ తల్లిదండ్రులు రాజకీయాల గురించి మాట్లాడుకునేటప్పుడు సుష్మాస్వరాజ్‌ ప్రస్తావన ఎక్కువగా వచ్చేది. అంతే ఇద్దరూ కలిసి తన కూతురు రాజకీయాల్లో రాణించాలని అనుకున్నారు.

అనుకోకుండా బల్దియా ఎన్నికలు రావడం వారికి కలిసొచ్చింది. పార్టీకి దరఖాస్తు చేసుకోవడం, టికెట్‌ లభించడం అన్నీ చకచకా జరిగిపోయాయి. డిగ్రీ (బీకాం కంప్యూటర్స్‌) అయిపోగానే ప్రజాప్రతినిధిగా ఎన్నికవడం జరిగిపోయాయి. కవాడిగూడ డివిజన్‌ కార్పొరేటర్‌ రచనశ్రీ గొడ్చాల జీవితంలో ఊహించని మార్పు ఇది. 150 మందిలో 21 ఏళ్లకే కార్పొరేటర్‌ అయిన ఈమె విజయం వెనుక ఆమె స్నేహితులే ఎక్కువగా ఉన్నారు. వారంతా రచనతోపాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇల్లిల్లూ తిరగడం, స్థానిక సమస్యలకు తాము చేయబోయే పరిష్కారాలు వివరించడం, ఇతర సమస్యలుంటే రాసుకోవడం, అందరినీ ఆప్యాయంగా పలకరించడం, సామాజిక మాధ్యమాలను వినియోగించడం ద్వారా ఓటర్లను ఆకట్టుకున్నారు. అదీగాక అతిచిన్న వయసు కావడం, రాజకీయాలకు కొత్త అనే అంశాలు ఓటర్లను ఆలోచింపజేశాయి.

ఇవన్నీ కలిసి రావడంతో ప్రత్యర్థి సిట్టింగ్‌ కార్పొరేటర్‌ అయినా రచన గెలుపు సునాయాసమైంది. మరోవైపు ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ వద్ద తండ్రి వెంకటేశ్‌కు ఉన్న టెంట్‌హౌస్‌ తనకు రాజకీయాల మీద ఆసక్తి కలిగేలా చేసింది. అదెలాగంటే అక్కడికి వచ్చిన పలు పార్టీల నేతలు మాట్లాడుకునే అంశాలు రచనను ప్రజాప్రతినిధిగా గెలిచేలా చేశాయి. డివిజన్‌ పక్కనే ఉన్న హుస్సేన్‌సాగర్‌ నాలా కారణంగా వరదలొచ్చిన ప్రతిసారీ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తుంటామని, దానికి రక్షణ గోడ నిర్మించడం తన ప్రధాన కర్తవ్యమని తెలిపింది. నామమాత్రపు ఖర్చుతో 1500 ఓట్ల మెజార్టీ సాధించానంది. అన్నట్లు రచన.. వాళ్లింట్లో పెద్దకూతురు. ఇప్పుడు కవాడిగూడ డివిజన్‌కు కూడా పెద్దకూతురే.

 

author avatar
Yandamuri

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?