మన వంటలక్క, ప్రేమి విశ్వనాథ్ తన అద్భుత నటనతో బుల్లితెర సీరియల్ ల జాబితాలో కార్తీకదీపం సీరియల్ ను ఇండియాలోనే నెంబర్ 1 రేటింగ్లో నిలబెడుతోంది. ప్రేమి విశ్వనాథ్ స్టార్ మా ఛానల్ లోని కార్తీకదీపం సీరియల్తో కోట్లాది మంది అభిమానులని సంపాదించుకుని ఒక సంచలన నటిగా మారింది. ఇక ఈ సీరియల్ తో ప్రేమి విశ్వనాధ్ రెండు తెలుగు రాష్ట్రాలలోను విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈమె హాట్ టాపిక్ గా మారింది.
స్టార్ మా ఛానల్ లో గత రెండు సంవత్సరాలుగా ప్రసారమవుతున్న ‘కార్తీకదీపం’ అనే సీరియల్ రెండు తెలుగు రాష్ట్రాల సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్ ఇప్పటికే 932 ఎపిసోడ్లు పూర్తిచేసుకుంది.
అయితే, ఈ రోజు ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా ఉంది. నిన్న ఎపిసోడ్ లో దీప పెర్ఫార్మన్స్ కి వంటలక్క ఫాన్స్ విసిల్స్ వేశారు. వంటలక్క మజాకా అంటున్నారు నెటిజన్స్. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో సౌందర్య తన అసహనాన్ని కార్తీక్ ముందు బయటపెట్టింది. త్వరలోనే నీ కళ్ళు తెరుచుకుంటాయి అప్పుడు నువ్వు బాధపడుతున్నప్పుడు ఓదార్చడానికి నేను ఉండాలి కదా అందుకే నేను నిన్ను ఏమి అనలేకపోతున్న ఇప్పుడు అంటుంది.
దీప గురించి సౌందర్య మాటల్లో విన్న అంజి శ్రావ్య దగ్గరనుంచి ఏదో కారణం చెప్పి మోనిత ఫోన్ నెంబర్ తీసుకుంటాడు. ఎలాగైనా మోనిత మరియు డాక్టర్ బాబులను విడతీయ్యాలన్న ఆలోచనలో ఉంటాడు అంజి. శ్రావ్య దగ్గర ఫోన్ నెంబర్ తీసుకుంటూ మనసులో, “ మోనితా నువ్వు అయిపోయావే” అనుకుంటాడు. దీనితో రేపటి ఎపిసోడ్ లో ఎం జరనున్నది జరగనున్నదో అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు.