NewsOrbit
Featured న్యూస్

రెడ్డి – చౌదరి వార్… జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్!

గతకొన్ని రోజులుగా ట్విట్టర్ వేదికగా విజయసాయి రెడ్డి వర్సెస్ బీజేపీ నేతలు (టీడీపీ నుంచి వచ్చినవారు) వార్ నడుస్తోన్న సంగతి తెలిసిందే! దీనికి ఆజ్యంపోసింది మాత్రం…మిడతల ట్వీట్ తో విజయసాయిరెడ్డే! బీజేపీ వైపు పసుపురంగు మిడతల దండు దండేత్తపోతుంది అంటూ సాయిరెడ్డి చేసిన ట్వీట్ కి బీజేపీ ఏపీ ఇన్‌ ఛార్జి సునీల్‌ దేవ్‌ ధర్‌ సైతం కదలాల్సిన పరిస్థితి వచ్చింది! ఈ క్రమంలో సాయిరెడ్డికి బీజేపీతోకానీ, అందులోని నాయకులు, ఇన్ ఛార్జి లతో కానీ ఎలాంటి సమస్య లేదని… సుజనా చౌదరే సాయిరెడ్డి టార్గెట్ అని ఫిక్సయిపోతున్నారు నెటిజన్లు!

ఇందులో భాగంగా… బాబు కోసం సుజనా తెరవెనుక కథలన్నీ నడుపుతున్నారని.. బాబుకోసం బీజేపీలో చేరి కోవర్టుగా పనిచేస్తున్నారని.. ఫలితంగా వైకాపా, బాబుని టార్గెట్ చేసిన ప్రతిసారీ బీజేపీ నుంచి మద్దతు కొరవడటానికి ఈయన లాబీలే కారణం అని సాయిరెడ్డి బలంగా నమ్ముతున్నారు! పార్క్ హయత్ లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో రహస్య భేటీతో ఈ నమ్మకం మరింత బలపడింది. ఈ క్రమంలో… అవకాశం వచ్చినప్పుడల్లా సుజనా చౌదరిని టార్గెట్ చేస్తున్నారు సాయిరెడ్డి!

తాజాగా… చౌకబారు శరనార్థులు, జూనియర్ ఆర్టిస్ట్, కెమరా ముందు కాషాయం – మేకప్ తీస్తే ఒరిజినల్ పసుపు అనే పదప్రయోగాలు వాడుతూ… సుజనాపై ఒక ట్వీటేశారు! నిన్నటివరకూ పరోక్షంగా మిడతల దండు అంటూ సంబోదించిన సాయిరెడ్డి… ఇప్పుడు నేరుగా డేరుగా పేరుపెట్టీ ఫైయిపోతున్నారు!

“సుజనా చౌదరి… నిన్ను టార్గెట్ చేయాలంటే తలకిందులుగా తపస్సు చేయాలా? నీలాంటి ‘చౌకబారు శరణార్ధులని’ మేము అసలు లెక్క చేయము. ముందు నీవు తలకిందులుగా తపస్సు చేయ్. బాబు కోవర్ట్ అనే ముద్ర చెరుపుకోవడానికి” అంటూ మొదలుపెట్టిన సాయిరెడ్డి… “సుజనా చౌదరి మాటలు విని కొందరు బిజెపి నాయకులు నవ్వుకుంటున్నారు. జూనియర్ ఆర్టిస్ట్ వేషం వేసి.. మొత్తం ఇండస్ట్రీనే పెంచి పోషిస్తున్నట్లు బిల్డప్ ఇచ్చే ‘కమెడియన్’ ని గుర్తు తెచ్చుకుంటూ. కెమరా ముందుకు వచ్చినపుడే కాషాయం. మేకప్ తీస్తే ఒరిజినల్ పసుపు.” అంటూ ముగింపు ఇచ్చారు!!

అయితే ఫైనల్ గా ఈ విషయాలపై విజయసాయి రెడ్డి ఇచ్చే క్లారిటీ రెడ్డి – చౌదరీ అని కాదు కానీ… లోపల పసుపురంగు వేసుకుని, మైకుల ముందు కాషాయం రంగు ప్రదర్శించే వాళ్లతో బీజేపీ జాగ్రత్తగా ఉండాలని సూచించడం మాత్రమే! ఇది అర్ధం చేసుకున్న బీజేపీ నేతలు సైలంట్ గా ఉంటున్నారు… సుజనా ఫీలవుతారేమో అనుకున్న బ్యాచ్ మాత్రం రీట్వీట్లు చేస్తున్నారని ఆన్ లైన్ వేదికగా కామెంట్లు పడుతున్నాయి!

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk