NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Murder: ఇద్దరు బాలుర ప్రాణాలు తీసిన బాబాయ్!రేపల్లెలో అతి ఘోరమైన నేరం!!

Murder: గుంటూరు జిల్లాలో ఘోరమైన నేరం జరిగింది.మానసిక స్థితి సరిగ్గా లేని సొంత బాబాయ్ చేతిలోనే చేతిలోనే ఇద్దరు చిన్నారులు హతమయ్యారు.రేపల్లె పట్టణంలో జరిగిన ఈ సంఘటన సంచలనం రేపుతోంది. అభం శుభం తెలియని చిన్నారులు అమ్మమ్మ ఇంటి వద్ద ఆడుకుంటున్న సమయంలో బాబాయి వరుస అయిన కాటూరి శ్రీనివాసరావు అనే సైకో ఇంటిలో తలుపులు మూసి వారిని చెక్క కర్రలతో కొట్టి దారుణంగా హత్య చేసిన ఈ ఉదంతం ప్రతి ఒక్కరినీ కదిలించివేస్తోంది.

Two Boys Killed In Repalle
Two Boys Killed In Repalle

పోలీసుల కథనం ఏమిటంటే!

రేపల్లె పట్టణ సీఐ సూర్యనారాయణ కథనం ప్రకారం పట్టణంలోని 23వ వార్డులో నివాసం ఉంటున్న మోర్ల విజయలక్ష్మి వద్ద ఆమె ఇద్దరు మనవలు కొద్దిరోజులుగా ఉంటున్నారు. చేబ్రోలు మండలం వేజండ్ల గ్రామానికి కొండేటి కోటేశ్వరరావు,ఉమాదేవి దంపతులు తమ ఇద్దరు కుమారులైన పార్థివ్ సాహసవత్ (10),రోహిత్ తశ్విన్ (8)లను వారి అమ్మమ్మ అయిన మోర్ల విజయలక్ష్మి వద్ద ఉంచారు.ఈ దంపతులిద్దరూ బెంగుళూరులో ఉద్యోగం చేస్తుండగా కరోనా నేపధ్యంలో పిల్లలను అమ్మమ్మ ఇంటికి పంపారు. వారినిద్దరినీ ఉమాదేవి చెల్లెలి భర్త అయిన కాటూరి శ్రీనివాసరావు సోమవారం అతి దారుణంగా హత్య చేశాడు.ఇంటిలో ఆడుకుంటున్న ఆ పిల్లలను కర్రలతో కొట్టి శ్రీనివాసరావు అతి దారుణంగా చంపేశాడు.

Murder: పోలీసులకు లొంగిపోయిన హంతకుడు!

అనంతరం హంతకుడు శ్రీనివాసరావు తనంతట తాను నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు.ఈ ఘాతుకానికి పాల్పడ్డ శ్రీనివాసరావు బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం గ్రామానికి చెందిన వాడు. కాటూరి శ్రీనివాసరావు మానసిక స్థితి సరిగా లేకపోవడంతో చాలాకాలంగా చికిత్స సైతం పొందుతున్నట్లు సమాచారం.అతను గతంలో కూడా అనేకసార్లు అత్యంత ఉద్రిక్తంగా ప్రవర్తించి బీభత్సం సృష్టించినట్లు సమీప బంధువులు చెబుతున్నారు.చివరకు ఉన్మాదిగా మారి ఇద్దరు పిల్లల ప్రాణాలు తీశాడు.అమ్మమ్మ విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.హృదయవిదారకమైన ఈ సంఘటన రేపల్లె పట్టణంలో నలుదిక్కుల దావాలనంలా వ్యాపించడంతో ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న హత్యగావించబడ్డ చిన్నారులను చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా ప్రభుత్వ వైద్యశాలకు చేరుకున్నారు. రేపల్లె పట్టణంలో మొదటిసారిగా చిన్నారులను అతి దారుణంగా చంపడం ఇదే ప్రథమం కావడంతో ఈ విషయంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

 

author avatar
Yandamuri

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju