Allu Arjun: అల్లు అర్జున్ కోసం ఇద్దరు హీరోయిన్లను సెట్ చేస్తున్నా డైరెక్టర్..??

Share

Allu Arjun: టాలీవుడ్ ఇండస్ట్రీలో గత ఏడాది ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా “అలా వైకుంఠపురం లో”. కరోనా రాకముందు ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నాన్ బాహుబలి రికార్డులను పగలగొట్టడం జరిగింది. ఆ తర్వాత ఆ స్థాయిలో మరో హిట్ ఇంతవరకు ఇండస్ట్రీలో పడలేదు. ఈ నేపథ్యంలో మంచి జోరుమీద ఉన్న అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Pooja Hegde to Rakul Preet Singh: 7 times stars proved ethnic chokers are  all you need to complete an outfit | PINKVILLA

పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా..నీ రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన పోస్టర్లు మరియు పాటలు అదేరీతిలో చిన్నపాటి టీజర్.. సోషల్ మీడియాలో అనేక రికార్డులు సృష్టించడం తెలిసిందే. దీంతో పుష్ప సినిమాపై అంచనాలు ఉన్న కొద్ది పెరుగుతూ ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బన్నీ.. “ఐకాన్” అనే సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు టాక్.

 

ఈ నేపథ్యంలో ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే తో పాటు మరొక హీరోయిన్ ని సెలెక్ట్ చేయడానికి ఈ సినిమా యూనిట్ రెడీ అవుతున్నట్లు గత కొన్ని రోజుల నుండి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు పూజా హెగ్డే తో పాటు రకుల్ ప్రీత్ సింగ్ నీ డైరెక్టర్ సెట్ చేసినట్లు త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా.. షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.


Share

Related posts

మెగా హీరో కోసం నేచుర‌ల్ స్టార్‌

Siva Prasad

Pushpa Movie : “పుష్ప” సినిమా కోసం ఏకంగా 6 గంటలు అల్లు అర్జున్..!!

sekhar

Ys Jagan : దివంగత వైఎస్ఆర్, జగన్ లపై సంచలన కామెంట్స్ చేసిన కమెడియన్ ఆలీ..!!

sekhar