రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

బొడిరెడ్డిపల్లి, జనవరి1: ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని త్రిపురాంతకం మండలం బొడిరెడ్డి పల్లె గ్రామం వద్ద గుంటూర్ కర్నూలు జాతీయ రహదారిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో మహిళ పరిస్ధితి విషమంగా ఉంది మార్కపురం ఏరియా వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.