తన స్నేహితురాలికి దగ్గర అవుతున్నాడన్న కక్షతో హరిహర కృష్ణ తన స్నేహితుడు నవీన్ ను అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటన ఇటీవల తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నవీన్, హరిహర కృష్ణ బీటెక్ విద్యార్ధులు కాగా, ఓ యువతి కారణంగా నవీన్ ను హరిహర కృష్ణ నవీన్ ను కిరాతకంగా హత్య చేశాడు. నవీన్ ను హత్య చేసిన తర్వాత గుండె చీల్చి, పేగులు బయటకు తీసి, మర్మాంగం కోసేసి హరిహర కృష్ణ సైకోగా వ్యవహరించారు. ఈ కేసులో నిజాలు నిగ్గు తేల్చే పనిలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా నవీన్ హత్య కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో హరిహరకృష్ణ స్నేహితురాలు, స్నేహితుడు హసన్ లను నిందితులుగా చేర్చి అరెస్టు చేశారు. నవీన్ హత్య కేసులో ఏ 2 గా హసన్, ఏ 3 గా యువతి పేరు ను పోలీసులు ఎఫ్ఐఆర్ లో చేరుస్తూ హత్య విషయం తెలిసి కూడా దాచారని ఇద్దరిపై అభియోగాలను మోపారు.

నవీన్ హత్య కేసులో ఆధారాలు చెరిపివేసేందుకు హరిహరకృష్ణకు మరో ఇద్దరు సహకరించినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. అరెస్టు చేసిన ఇద్దరు నిందితులను సోమవారం హయత్ నగర్ కోర్టులో హజరుపర్చి రిమాండ్ కు తరలించారు. నవీన్ ను హత్య చేసిన తర్వాత హరిహరకృష్ణ ,, నవీన్ శరీర భాగాలను ఓ సంచిలో వేసుకుని ద్విచక్ర వాహనంపై బ్రాహ్మణపల్లిలోని స్నేహితుడు హసన్ ఇంటికి వెళ్లాడనీ, ఆ తర్వాత అతనితో కలిసి మన్నెగూడ పరిసరాలకు వెళ్లి అక్కడ నవీన్ శరీరభాగాలను పడేశాడు. ఆ తర్వాత హసన్ ఇంటికి వెళ్లి దుస్తులు మార్చుకుని రాత్రి అక్కడే ఉండి మరుసటి రోజు బీఎన్ రెడ్డి నగర్లో ఉండే స్నేహితురాలి ఇంటి వద్దకు వెళ్లాడు. ఆమెకు నవీన్ ను హత్య చేసిన విషయం తెలిపి అమె వద్ద ఖర్చుల కోసం రూ.1500లు తీసుకుని వెళ్లాడు. తర్వాత ఫోన్ లో నిహారిక, హసన్ తో సంప్రదింపులు జరిపాడు. 20వ తేదీ సాయంత్రం మరో సారి యువతి వద్దకు వెళ్లి ఆమెను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని నవీన్ ను హత్య చేసిన ప్రాంతానికి తీసుకువెళ్లి చూపించాడు. ఆ తర్వాత యువతిని ఇంటి వద్ద వదిలివేసి వెళ్లిపోయాడు హరిహర కృష్ణ.
21వ తేదీన నవీన్ కుటుంబ సభ్యులు హరిహర కృష్ణకు ఫోన్ చేసి నవీన్ ఆచూకీ గురించి అడగడంతో హత్య విషయం బయటపడుతుందనే భయంతో పారిపోయాడు. ఆ తర్వాత ఖమ్మం, విజయవాడ, విశాఖలో తలదాచుకుని 23వ తేదీ వరంగల్లు లో తండ్రి వద్దకు చేరుకున్నాడు. అప్పటికే పోలీసులు హరిహర కృష్ణ కోసం గాలిస్తున్నట్లు తండ్రి చెప్పడంతో 24వ తేదీ హరిహర కృష్ణ హైదరాబాద్ లో హసన్ వద్దకు వెళ్లాడు. హసన్, హరిహరకృష్ణ ఇద్దరూ కలిసి మన్నెగూడ లో నవీన్ శరీర అవయవాలు పడేసిన ప్రాంతానికి వెళ్లి వాటిని తిరిగి తీసుకుని హత్య చేసిన ప్రదేశానికి వచ్చి తగులబెట్టారు. ఆ తర్వాత బీఎన్ రెడ్డి నగర్ లోని యువతి నివాసానికి వెళ్లి స్నానం చేసి ఆ తర్వాత అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపాయాడు హరిహరకృష్ణ.
‘ఫేక్ షోలు చేయడం టీడీపీకి మొదటి నుండి అలవాటు’.. ఇదీ ఉదహరణ .. అమర్
ఏపికి ప్రత్యేక హోదా ఎప్పుడు వస్తుందంటే..? ఆ మాజీ ఎంపీ కీలక వ్యాఖ్యలు..!!