Prabhas : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కమిటయిన భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలలో ‘ప్రాజెక్ట్ కే’ ఒకటి. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి అశ్వనీ దత్ సమర్పణలో స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ రూపొందిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఇటీవలే హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా ప్రారంభం అయి ఫస్ట్ షెడ్యూల్ సాగుతోంది. ప్రముఖ సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాస్ రావు ఈ ప్రాజెక్ట్ కె కి క్రియేటివ్ హెడ్ గా వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా అలాగే బాలీవుడ్ స్ట్రైట్ మూవీ ఆదిపురుష్ కంప్లీట్ అయ్యాక ప్రాజెక్ట్ కె లో జాయిన్ అవనున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకోణ్ హీరోయిన్గా నటిస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో ఆమెది నెగిటివ్ రోల్ అని కూడా టాక్ వినిపిస్తోంది. అలాగే ప్రభాస్ కి గురువుగా బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో మరో ఇద్దరు స్టార్ హీరోలు కూడా నటించనున్నట్టు సమాచారం. ఆ హీరోలకి సౌత్ అలాగే నార్త్ మొత్తంగా క్రేజ్ ఉన్న యంగ్ హీరోలను తీసుకున్నారట.
Prabhas : అమితాబ్ ని అవమానించడమే అని కూడా మేకర్స్ భావిస్తున్నారట.
ఆ హీరోలే విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్. వీరిద్దరికి బాగా క్రేజ్ ఉంది. విజయ్ దేవరకొండ ఇప్పటికే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత విజయ్ కి బాలీవుడ్ లో కూడా బాగా క్రేజ్ రావడం గ్యారెంటీ. ఇక అమితాబ్ తో కీలక సన్నివేశాలుంటాయట. అలాంటప్పుడు అంతగా గుర్తింపు లేని వాళ్ళని తీసుకుంటే అమితాబ్ ని అవమానించడమే అని కూడా మేకర్స్ భావిస్తున్నారట. అందుకే ఈ యంగ్ హీరోలను తీసుకుందామని డిసైడయినట్టు తెలుస్తోంది. అలాగే జాతి రత్నాలు ఫేం నవీన్ పొలిసెట్టిని తీసుకోనున్నారట. వీరు ముగ్గురు వైజయంతీ మూవీస్ లో సినిమాలు చేశారు.