ఢిల్లీలో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్టు

ఢిల్లీ, జనవరి 25: దేశ రాజధాని ఢిల్లీలో ఇద్దరు తీవ్రవాదులను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పేలుడు పదార్ధాలతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం కలిగించేందుకు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు ప్రణాళిక రచించారు. ఈ పధకం పసికట్టిన మిలటరీ ఇంటిలిజెన్స్ వర్గాలు ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించారు.

జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన అబ్దుల్ లతీఫ్ ఘనీ, హిలాల్ అహ్మద్ భట్‌లను ఢిల్లీలోని లక్ష్మీనగర్‌లో  పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుండి పేలుడు పదార్ధాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.