Video Viral: కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు మహిళా మున్సిపల్ పారిశుద్య కార్మికులు అసువులు బాశారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మెదక్ జిల్లా కేంద్రంలో శనివారం ఉదయం జరిగింది. ఈ ప్రమాద ఘటన సమీపంలోని పెట్రోల్ బంక్ సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వివరాల్లోకి వెళితే .. పట్టణంలో పారిశుద్ద్య విదులు నిర్వహించేందుకు కార్మికులు ఉదయం కార్యాలయానికి వెెళుతున్నారు. ఈ సమయంలో హైదరాబాద్ వైపు వెళుతున్న కారు అతివేగంగా వారిపై దూసుకువెళ్లింది. దీంతో దాయరవీధికి చెందిన నరసమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, యాదమ్మ అనే మహిళా కార్మికురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడ్డారు.

స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న డీఎస్పీ సైదులు, సీఐ మధు, రూరల్ సీఐ విజయ్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు మహిళా కార్మికుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కాారణమైన కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని కారును స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. డ్రైవర్ నిర్లక్ష్యంపై నెటిజన్ లు మండిపడుతున్నారు.
#CCTV #Horrific : Two Municipal workers were died, while 4 others admitted in hospital with grave injuries, after a #Speeding car hits 6 persons at #Medak at early morning today, the car driver was arrested, said Medak police.#RoadAccident #caraccident #RoadSafety #Telangana pic.twitter.com/tcXPrLLN9D
— Surya Reddy (@jsuryareddy) December 24, 2022