NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఈ బుడ్డోడి స‌మాధానాల‌కు అంద‌రూ ఫిదా!

మాట‌లు కూడా స‌రిగ్గారాని కొంత మంది చిన్నారులు చేసే ప‌నులు, చెప్పే మాట‌లు చూస్తే.. వాళ్ల వ‌య‌సుకు, మాట‌ల‌కు, చేత‌ల‌కు అస‌లు సంబంధమే లేదు అనిపిస్తుంది క‌దూ.. నిజ‌మే కొంద‌రు పిల్ల‌లు మాట‌లే స‌క్క‌గా రావు కానీ ప‌ద్యాలు, పాట‌లు పాడి ఔరా అనిపించుకుంటారు. ఎంతో క్లిష్ట‌మైన స‌మాధానాలను కూడా గుర్తు పెట్టుకుని అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తుంటారు. ఇలా ఇంకో బుడ‌త‌డు కూడా త‌న చిట్టిపొట్టి మాట‌ల‌తో అంద‌రిని ఫిదా చేస్తున్నాడు.

ఆ బుడ్డోనికి ఏబీసీడీలు రాసేంత వయసు కూడా లేదు. కానీ ప‌లు దేశాల జాతీయ జెండాల‌ను చూపిస్తే.. దేశం పేరు ట‌క్కున చెప్పేస్తున్నాడు. సైన్స్ ఫార్ములా అంటే అస‌లే ఎరుగ‌ని ఆ బుడ్డోడు.. ర‌సాయ‌న స‌మీక‌ర‌ణ‌లు చెప్తూ.. అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాడు. వ‌య‌సు రెండేళ్లే అయినా.. త‌న చిట్టి మెద‌డుతో ఎన్నో అద్భుతాలు చేస్తూ.. అంద‌రి చేత ఔరా అనిపించుకుంటున్నాడు. అందుకే అతి చిన్న వ‌య‌సులో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా చోటు సాధించాడు.

ఆంధ్ర ప్ర‌దేశ్ లోని విజయవాడకు చెందిన బుడ్డోడు అక్షిత్ . అత‌ని వయసు రెండేళ్లు. ఇప్పుడిప్పుడే మాట‌లు వ‌స్తున్నాయి. వ‌య‌సు చిన్న‌దే అయినా కానీ తన మెమోరీ మాత్రం అమోగం. ఒక్కసారి మ‌నం ఏదైనా చెప్తే చాలా అలా గుర్తుంచుకుంటాడు. ఏ దానైనా ట‌క్కున గుర్తు పెట్టుకుంటాడు. ఎన్నో దేశాల జాతీయ జెండాల‌ను గుర్తుప‌ట్టేస్తాడు. ఇక దేశ రాజధానుల పేర్లు చెప్ప‌మంటే గుక్క తిప్పుకోకుండా చెప్పేస్తాడు.

ఏది చూసినా.. ఏది విన్నా.. ఇట్టే గుర్తు పెట్టుకుంటాడు. మ‌ళ్లీ ఎప్పుడైనా దాని గురించి అడిగితే ఇట్టే చెప్పేస్తాడు. ప్రముఖుల ఫొటోల‌ను చూపిస్తే.. చాలు వారి పేర్లు చేప్పేస్తాడు. ఎంతో క‌ష్ట‌మైన రసాయనాల పేర్లు చెప్పేస్తూ..అంద‌రిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. చిన్న వయసులోనే అక్షిత్‌ జనరల్‌ నాలెడ్జ్‌లో మంచి ప్రతిభ క‌న‌బ‌రుస్తూ.. అంద‌రితో బేష్ అనిపించుకుంటున్నాడు. త‌న ప్ర‌తిభ‌కు ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం ల‌భించింది.

విజయవాడలోని అయ్యప్పనగర్‌లో మురళీకృష్ణ, శిరీష అనే దంప‌తులు జీవిస్తున్నారు. వారి కొడుకే.. అక్షిత్‌. ముర‌ళీ కృష్ణ ఒక‌ బ్యాంకులో మేనేజర్‌, శిరీష హౌజ్ వైఫ్. అక్షిత్ కు ఏదాదిన్న‌ర వ‌య‌సు ఉన్న‌ప్పుడే శిరీష అత‌నిలో ఉన్న నైపుణ్యాల‌ను గుర్తించింది. దాంతో ఆ బుడ్డోడికి ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇప్పించారు. భ‌విష్య‌త్ లో అక్షిత్ సైంటిస్ట్ కావాల‌న్న‌ది ఆ త‌ల్లిదండ్రుల కోరిక‌.

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju