Udaipur Murder: ఉదయ పూర్ టైలర్ హత్య కేసు నిందితులపై కోర్టు ప్రాంగణంలో దాడి

Share

Udaipur Murder: రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్నయ్య కుమార్ ను దారుణంగా హత్య చేసిన నిందితులపై జైపూర్ కోర్టు వద్ద పలువురు దాడికి పాల్పడ్డారు. టైలర్ కన్నయ్య కుమార్ దారుణ హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నాయకురాలు నుపూర్ శర్మ అభ్యంతరకర వ్యాఖ్యలను సమర్ధించిన కారణంగా టైలర్ కన్నయ్య కుమార్ ను రియాజ్ అక్తరీ, గౌస్ మహమ్మద్ లు పట్టపగలు అత్యంత దారుణంగా హత్య చేశారు. వారు ఈ ఘటనను చిత్రీకరించడంతో పాటు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తాము గొప్పపని చేసినట్లుగా మహమ్మద్ ప్రవక్తను కించపరిచినందుకు ప్రతీకారం తీర్చుకున్నాము, ప్రధాన మంత్రి మోడీని కూడా బెదిస్తూ సందేశంలో పేర్కొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటనతో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అక్కడి అధికారులు నెల రోజుల పాటు నిషేదాజ్డలు విధించారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏకి అప్పగించింది. నిందితులు ఇద్దరూ ఉగ్రవాద శిక్షణ పొందిన వారిగా ఎన్ఐఏ గుర్తించింది.

Udaipur Murder case accused attacked by crowd outside NIA Court in Jaipur

 

కన్నయ్య కుమార్ ను హత్య చేయడంలో రియాజ్, గౌస్ విఫలమైతే దాడి చేసేందుకు స్టాండ్ బై గా మొహిన్, ఆసీఫ్ అనే ఇద్దరు అక్కడే ఉన్నట్లుగా ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడి కావడంతో వారిద్దరిని గురువారం అరెస్టు చేశారు. నిందితులను భారీ భద్రత నడుమ ఎన్ఐఏ అధికారులు జైపూర్ కోర్టులో హజరుపర్చారు. ఈ క్రమంలో కోర్టు ఆవరణలో గుమిగూడిన ప్రజలు నిందితులపై దాడికి పాల్పడ్డారు. న్యాయవాదులు వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కన్నయ్య హంతకులను మరణ శిక్ష విధించండి, పాకిస్థాన్ ముర్దాబాద్ అంటూ నిరసన వ్యక్తం చేశారు. కోర్టు ప్రాంగణంలో నిందితులపై ప్రజలు దాడి చేయడంతో అప్రమత్తమైన పోలీసులు వారికి హని కలగకుండా వెంటనే వ్యాన్ లోకి ఎక్కించి రక్షించారు. కాగా, కోర్టు ఈ నిందితులను జూలై 12 వరకూ ఎన్ ఐ ఏ కస్టడీకి అప్పగించింది.,


Share

Recent Posts

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

2 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

2 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

2 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

3 hours ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

4 hours ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

5 hours ago