ట్రెండింగ్ న్యూస్

Udaya bhanu : ఉగాది స్పెషల్ ఈవెంట్ లో మెరిసిన ఉదయభాను

udaya bhanu in ugadi special event
Share

Udaya bhanu : ఉదయభాను గుర్తుందా మీకు? ఒక 20 ఏళ్ల క్రితం ఏ చానెల్ లో చూసినా యాంకర్ అంటే ఉదయభానునే కనిపించేది. ఉదయభానుకు అప్పుడున్న క్రేజే వేరు. తను చాలా సంవత్సరాల పాటు తెలుగు యాంకర్ గా కొనసాగింది. ఆ తర్వాత పెళ్లి చేసుకొని తన యాంకరింగ్ కెరీర్ కు బ్రేక్ ఇచ్చింది.

udaya bhanu in ugadi special event
udaya bhanu in ugadi special event

అయితే… ప్రస్తుతం ఉదయభాను ఇండస్ట్రీలో తన సెకండ్ కెరీర్ ను కొనసాగించాలని అనుకుంటోంది. అందుకే… తను ఈ మధ్య కొన్ని షోలలో కనిపిస్తోంది.

Udaya Bhanu : ఉగాది జాతిరత్నాలు ఈవెంట్ లో జడ్జిగా ఉదయభాను

అయితే… త్వరలో ఉగాది పండుగ రానున్న సందర్భంగా ఈటీవీ యాజమాన్యం… ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ను ఉగాది రోజున ప్రసారం చేయనుంది. దానికి ఉగాది జాతిరత్నాలు అనే పేరు పెట్టారు. ఈ ప్రోగ్రామ్ షూటింగ్ ఇప్పటికే పుర్తి కాగా… ఈ ఈవెంట్ లో జడ్జిగా ఉదయభానును తీసుకున్నారు.

చాలారోజుల తర్వాత ఉదయభాను బుల్లితెర మీద కనిపిస్తుండటంతో తన అభిమానుల సంతోషానికి అవధులు లేవు. ఉదయభానుకు అందరూ వెల్ కమ్ చెప్పడమే కాదు… తనను చూసి స్టేజ్ మీద ఉన్నవాళ్లు అందరూ ఫుల్ హ్యాపీ అయ్యారు. సుడిగాలి సుధీర్ అయితే.. ఉదయభాను ఫ్యాన్స్ అసోషియేషన్ అధ్యక్షుడిని నేను అంటూ ఉదయభాను ముందు ఫోజులు కొట్టబోయాడు.

మొత్తానికి చాలారోజుల తర్వాత ఉదయభాను బుల్లితెర మీద మెరవనుండటంతో ఎప్పుడు ఆ షో ప్రసారం అవుతుందా? అని బుల్లితెర ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతానికైతే… ఉగాది జాతిరత్నాలు ప్రోమో విడుదలైంది. దాన్ని చూసి ఎంజాయ్ చేయండి.


Share

Related posts

 11th Hour Teaser : ఆకట్టుకొంటున్న తమన్నా 11th అవర్ టీజర్..

bharani jella

దిశ కేసు నిందితుడి తండ్రికి ప్రమాదం

Mahesh

ఆ గ్రూప్ బ్లడ్ వారికి కరోనా వైరస్ శుభవార్త.. ఏంటంటే?

Teja