భారత ప్రధాని మోడీ కి మరో అరుదైన గౌరవం..జీ – 7 భేటీకి ఆహ్వానం

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి మరో అరుదైన గౌరవం లభించింది. ఈ ఏడాది యుకెలో జరగనున్న జీ – 7 దేశాల శిఖరాగ్ర సమావేశాలకు మోడీ అతిధిగా ఆహ్వానం అందుకున్నారు. ప్రధాని మోడిని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సస్ ఆహ్వానించారు. భారత ప్రధాని నరేంద్ర మోడిని శిఖరాగ్ర సమావేశాలకు అహ్వానించినట్లు బోరిస్ అధికారికంగా ప్రకటించారు. జీ – 7 భేటీకి ముందే భారత్ లో తాను పర్యటించాలన్న ఆలోచనలో ఉన్నట్లు బోరిస్ తెలిపారు. జీ -7 బృందంలో ఆమెరికా, యూకే, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ సారి జరిగే శిఖరాగ్ర సమావేశాల్లో ప్రపంచ దేశాలను కుదిపేసిన కరోనా మహమ్మారిపై ప్రధాన చర్చ ఉంటుందని భావిస్తున్నారు.

uk invites pm modi for g7

ఈ ఏడాది జూన్ 11 నుండి 13వ తేదీ వరకూ మూడు రోజుల పాటు బ్రిటన్ వేదికగా జీ – 7 దేశాల శిఖరాగ్ర సమావేశాలను జరుపనున్నారు.  ఈ సమావేశాలకు భారత్ తో పాటు దక్షిణ కొరియా, ఆస్ట్రేలియాలను అతిథ్య హోదాలో ఆహ్వానం పలికినట్లు బోరిస్ తెలిపారు. ఈ ఏడాది భారత్ లో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు తాను హజరుకావాల్సి ఉండగా యుకేలో కరోనా సంక్షోభం కారణంగా ఈ పర్యటన రద్దు అయ్యిందని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు.