NewsOrbit
న్యూస్

Ukraine Crisis: ఉక్రెయిన్ నుండి చేరుకుంటున్న తెలుగు విద్యార్ధులు

Ukraine Crisis: రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో తెలుగు విద్యార్ధులు క్షేమంగా వచ్చేస్తున్నారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్ధులను తరలించేందుకు ఆపరేషన్ గంగ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ సరిహద్దు దేశాల నుండి బారత విద్యార్ధులను ప్రత్యేక విమానాల ద్వారా ఇండియాకు తరలిస్తోంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ నుండి పెద్ద సంఖ్యలో తెలుగు విద్యార్ధులు స్వదేశానికి చేరుకుంటున్నారు.

Ukraine Crisis large number of telugu students reached delhi
Ukraine Crisis large number of telugu students reached delhi

Ukraine Crisis: నాలుగు ప్రత్యేక విమానాల్లో 145 మంది తెలుగు విద్యార్ధులు

శనివారం ఒక రోజు నాలుగు ప్రత్యేక విమానాల్లో 145 మంది తెలుగు విద్యార్ధులు ఢిల్లీకి చేరుకున్నారు. వీరిలో ఏపికి చెందిన విద్యార్ధులు 83 మంది, తెలంగాణకు చెందిన విద్యార్ధులు 62 మంది ఉన్నారు. ఢిల్లీకి చేరుకున్న ఈ విద్యార్ధులను స్వస్థలాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్ధులు క్షేమంగా స్వదేశానికి రావడంతో ఆ విద్యార్ధుల కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మిగిలిన విద్యార్ధులను కూడా త్వరగా తీసుకురావాలని కోరుతున్నారు.

Read More: YSRCP: 151 నియోజకవర్గాల్లో ఆ నియోజకవర్గం జగన్‌కు తలనొప్పిగా మారింది..?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు

ఢిల్లీకి చేరుకున్న విద్యార్ధులు అక్కడ ఉక్రెయిన్ లో వారు పడిన ఇబ్బందులు, అక్కడి పరిస్థితులను వివరిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా అటు రష్యా ప్రధాని, ఉక్రెయిన్ అధ్యక్షులతో విద్యార్ధుల తరలింపుపై మాట్లాడిన సంగతి తెలిసిందే. పలువురు కేంద్ర మంత్రులకు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు మోడీ. దీంతో వారు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ విద్యార్ధుల తరలింపు ప్రక్రియను వేగవంతం చేశారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N