రష్యా – ఉక్రెయిన్ యుద్దం: 53 మంది ఉక్రెయిన్ యుద్ద ఖైదీలు మృతి

Share

ఉక్రెయిన్ పై నెలల తరబడి యుద్దం చేస్తున్న రష్యా .. కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటూ ముందుకు వెళుతోంది. మరో పక్క ఉన్న వనరులతోనే ఉక్రెయిన్ సైన్యం రష్యాను ఎదుర్కొంటోంది. రష్యా క్షిపణి దాడులతో ఉక్రెయిన్ లో భారీగా ఆస్తి, ప్రాణనష్టం సంభవిస్తొంది. ఉక్రెయిన్ లోని కొన్ని నగరాలు, పట్టణాలు శవాల దిబ్బలుగా మారుతున్నాయి. తాజాాగా రష్యా జరిపిన క్షిపణి దాడిలో ఉక్రెయిన్ లోని 53 మంది యుద్ద ఖైదీలు మృతి చెందగా మరో 75 మంది గాయపడ్డారు. మరియపోల్ నగరం హస్తగతం అయిన తరువాత యుద్ద ఖైదీలుగా చిక్కిన ఉక్రెయిన్లను రష్యా అనుకూల వేర్పాటు వాదులు ఒలెనివ్ కా జైలులో ఉంచారు. ఈ జైలుపై శుక్రవారం జరిపిన భీకర రాకెట్ దాడిలో 53 మంది చనిపోయారు. అయితే ఈ ఘటనపై ఉక్రెయిన్, రష్యా పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి.

 

అమెరికా రాకెట్ లాంఛనర్లతోోనే ఉక్రెయిన్ బలగాలు ఈ దాడి చేశాయని రష్యా ఆరోపిస్తోంది. ఘటన ప్రాంతంలో పడిన ఆమెరికా తయారీ రాకెట్ విడిభాగాలను కనుగొన్నట్లు అధికార నొవొస్తి వార్త సంస్థ తెలిపింది. జైలుపై జరిగిన దాడి ఘటనలో గాయపడిన వారిలో 8 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి లెప్టినెంట్ జనరల్ ఇగార్ కొనాషెంకోవ్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ లపై చిత్ర హింసలు, మరణ శిక్షణల అమలును కప్పిపుచ్చుకునేందుకు రష్యానే ఈ దాడికి పాల్పడిందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. మరో పక్క డొనెట్స్క్ లో రష్యా దాడులు తీవ్రతరం కావడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఉక్రెయిన్ అధికారులు సూచించారు.


Share

Recent Posts

సముద్రతీరానికి కొట్టుకొచ్చిన అనుమానిత బోటు.. అందులో ఏకే 45 ఆయుధాలు.. అసలు మ్యాటర్ ఏమిటంటే..?

మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన హరిహరేశ్వర్ బీచ్ వద్ద ఏకే 47 ఆయుధాలు కల్గిన పడవ కనిపించడం కలకలాన్ని రేపింది. ముంబైకి 190 కిలీ మీటర్ల…

5 నిమిషాలు ago

కియారా అద్వానిపై దారుణంగా ట్రోలింగ్.. అంత తప్పు ఏం చేసింది..?

నటి కియారా అద్వానీకి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో భరత్ అనే నేను సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ…

29 నిమిషాలు ago

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

1 గంట ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

1 గంట ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

2 గంటలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

2 గంటలు ago