NewsOrbit
న్యూస్ ప్ర‌పంచం

Ukraine Russia War: ఉక్రెయిన్ లో ప్రముఖ నగరాలను చుట్టముట్టిన రష్యా సేనలు .. ఎంత మంది సైనికులు మృతి చెందారంటే..?

Ukraine Russia War: ఉక్రెయిన్ పై రష్యా భీకర పోరు కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ తో పాటు ప్రముఖ నగరాలను రష్యా సేనలు చుట్టుముట్టాయి. కీవ్ కు 15 కిలో మీటర్ల దూరంలో సేనలు విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నాయని అధికారవర్గాల సమాచారం. రష్యా దాడి నేపథ్యంలో ఉక్రెయిన్ లో పలు చిన్న నగరాలు పూర్తిగా ధ్వంసమైయ్యాయిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పేర్కొన్నారు. యుద్దంలో ఇప్పటి వరకూ తమ సైనికులు 1300 మంది చనిపోయారని ఆయన తెలిపారు. యుద్దంలో 579 మంది పౌరులు మృతి చెందగా, వెయ్యి మందికి పైగా క్షతగాత్రులు అయ్యారని ఐక్య రాజ్యసమితి తెలిపింది. ఉక్రెయిన్ యుద్ధం ప్రాంతం నుండి తరలించేందుకు ఏర్పాటు చేసిన మానవతా కాన్వాయ్ పైనా రష్యా దాడి చేసింది. రష్యా బలగాల దాడిలో తాజాగా ఓ చిన్నారితో సహా ఏడుగురు చనిపోయారు. కీవ్ కు ఈశాన్యంలో 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న పెరెమోహా గ్రామం నుండి వందలాది మంది స్థానికులు వలస వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా రష్యాదాడికి పాల్పడింది.

Ukraine Russia War Updates
Ukraine Russia War Updates

మెలిటోపోల్ నగర మేయర్ అపహరణ

మరో పక్క మెలిటోపోల్ నగరాన్ని రష్యా ఆధీనంలో తీసుకోవడంతో పాటు నగర మేయర్ ఇవాన్ ఫెడోరోవ్ ను అపహరించారు. నగర మేయర్ అపహరణపై జెలెన్ స్కీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇది ఐసీసీ ఉగ్రవాదుల చర్యకంటే తక్కువేంకాదని అన్నారు. మేయర్ విడుదలకు మధ్యవర్తిత్వం వహించాలని ఇజ్రాయిల్ ప్రధాని బెన్నెట్ ను జెలెన్ స్కీ కోరారు. మెలిటోపోల్ నగరానికి కొత్త మేయర్ గా గనినా డనిల్చేంకోను నియమించినట్లు జపోరిజ్జియా స్థానిక పరిపాలనా విభాగం తెలిపిింది.

రష్యా సరిహద్దు ప్రాంతాల్లో ఆమెరికా సేనలు

ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతున్న క్రమంలో రష్యా సరిహద్దు ప్రాంతాల్లో ఆమెరికా సేనల తరలింపు జరుగుతోంది. సుమారు 12 వేల ట్రూపుల సైన్యాన్ని తరలిస్తున్నామనీ వారంతా లాత్వియా, ఎస్టోనియా, లిథువేనియా, రోమేనియా భూభాగాల్లో మోహరిస్తారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. అయితే ఇది మూడో ప్రపంచ యుద్ధం నిమిత్తం వారిని ఉక్రెయిన్ కు పంపడం లేదనీ, నాటో భూభాగంలో ప్రతి అంగుళాన్ని కాపాడుతామన్న సందేశం ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని జో బైడెన్ తెలిపారు. హౌస్ డెమోక్రటిక్ కాకస్ సభ్యులను ఉద్దేశించి జో బైడెన్ ఈ విషయాన్ని వెల్లడించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju