Bigg Boss 5 Telugu: వాళ్లే టాప్ ఫైవ్ లో ఉంటారన్న ఉమా దేవి..!!

Share

Bigg Boss 5 Telugu:  బిగ్ బాస్ హౌస్ లో రెండో వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఉమాదేవి. హౌస్ లో ఉన్నంత కాలం ఎడాపెడా వాయిన్చేస్తూ… ఇంటి సభ్యుల నడిపించిన ఉమాదేవి రెండో వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ టైములో దారుణంగా మాట్లాడటంతో… ఆమెకు ఓట్లు సరైన రీతిలో పడక ఎలిమినేట్ అయ్యారు. ఇంటిలో ఉన్నంతకాలం ఎక్కడ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వనీ ఉమాదేవి..మాస్క్ లేని గేమ్ వాడటం జరిగింది.

ఎంటర్ టైన్ చేసే టైంలో ఎంటర్టైన్ చేయటం.. వాగ్వివాదం విషయంలో ఉగ్ర రూపం చూపించిన ఉమాదేవి ఎక్కువగా హౌస్ లో యాంకర్ లోబో తో… కామెడీ చేసి కడుపుబ్బ నవ్వించారు. కానీ రెండో వారం ఎలిమినేషన్ ఎలిమినేషన్ టైం లోనే ఆమె మాట్లాడిన బూతులు వల్ల చాలా వరకు ఆమె ఇమేజ్ డ్యామేజ్ అయి… ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యేలా ఆమె పాలిట శాపంగా మారాయి.

bigg boss 5 telugu second week elimination actress uma devi out from house | బిగ్‌బాస్‌ నుంచి ఉమాదేవి ఔట్ వినోదం News in Telugu

ఇదిలా ఉంటే హౌస్ నుండి బయటకు వచ్చాక… అనేక ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న ఉమాదేవి..ఇటీవల బిగ్ బాస్ షో నిర్వాహకులు ఇచ్చిన రెమ్యూనరేషన్ లో.. కొంత భాగం.. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న పేషెంట్ కి.. ఖర్చు పెడుతున్నట్లు తెలిపింది. ఇదిలా ఉంటే.. ఓ ప్రముఖ టీవీ మీడియా ఛానల్ కి.. ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ హౌస్ విషయాలు తెలియ జేస్తూ సంచలన విషయాలు.. వీక్షకుల తో పంచుకుంది. హౌస్ లో ఇంకా ఉండవలసింది కానీ ఎలిమినేట్ అయ్యా ఊహించలేదు అని..హౌస్ చాలా మిస్ అవుతున్నాను అని పేర్కొంది. ముఖ్యంగా కిచెన్ లో… ప్రియా అదే రీతిలో ప్రియాంక సింగ్ లతో… కలిసి పని చేయటం తో బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాము అని స్పష్టం చేసింది. ఇంకా హౌస్ లో అనేక విషయాలను తెలియజేస్తూ.. స్క్రిప్ట్ పరంగా ఎక్కడ ఉండదని ఎవరు గేమ్ వాళ్ళ ఆడతారని.. ఈ నేపథ్యంలో తన అంచనా ప్రకారం టాప్ ఫైవ్ లో కి వెళ్ళేది..జెస్సీ, మానస్‌, రవి, సన్నీ అని స్పష్టం చేసింది.

 

హౌస్ లో సన్నీ బయట ఎలా ఉన్నాడో..హౌస్ లో కూడా అలాగే ఉన్నాడు అని అందువల్లే బయటకొచ్చాక అతడికి బాగా సపోర్ట్ చేస్తున్నట్లు తెలిపింది. హౌస్ లో తాను రెండు వారాలు ఉన్న టైంలో కెప్టెన్ గా సిరి, విశ్వ ఇద్దరిలో..విశ్వ..చాలా కరెక్ట్ అని పేర్కొంది. లోబో తాను చేసిన ఒక చిన్న ఫన్నీ కంటెంట్ అది టీవీలో రాలేదని.. అదే గనుక ఒకవేళ వచ్చి ఉంటే వేరేలా ఉండేదని..లోబో కోసం గౌన్ వేసుకున్నాను అదే రీతిలో లోబో నీ..ఫాంట్ .. షర్ట్ వేసుకోమని అంటే అతడు అదే వేసుకున్నాడు ఇద్దరం కలిసి హౌస్ లో బాగా ఎంటర్టైన్ చేశాం.. అది రాలేదు అది వచ్చి ఉంటే వేరే గా ఉండేదాన్ని ఉమాదేవి తెలియజేసింది. ఇంకా హౌస్ లో సిరి కొంచెం కనింగ్ అని..పేర్కొంది. హౌస్ లో చాలా వరకు అందరికీ బాండింగ్ ఏర్పడిందని..

రెండు వారాలు తనకు సరిపోలేదని ఉమాదేవి పేర్కొంది. ఇదిలా ఉంటే ఉమాదేవి హౌస్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత.. హౌస్ లో సందడి లేకుండా పోయిందని..షో .. కాస్త పలచబడి ఉందని బిగ్ బాస్ ఆడియన్స్ అంటున్నారు. ఏది ఏమైనా ఉమాదేవి హౌస్ లో ఉంటే.. షో ఇప్పుడున్న దానికంటే మరో లెవెల్లో ఉండేదని.. బ్యాడ్ లక్ అని పేర్కొన్నారు. ఆ రెండో వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ సమయంలో ఆమె నాలుక జారకుండా ఉండే ఉంటే.. హౌస్ లో కొనసాగే వారిని అనవసరంగా ఉమాదేవి బారస్ట్ అయ్యారని.. చాలామంది ఆమే ఎలిమినేషన్ పై ఈ విధంగా రియాక్ట్ అవుతున్నారు.


Share

Related posts

IND v ENG : ఈ రోజు మ్యాచ్ లో వీరిద్దరే కీలకం ! క్లిక్ అయితే ఇంగ్లండ్ ఖేల్ ఖతం

arun kanna

ATM: అదిరిపోయే వార్తః ఏటీఎంలో డ‌బ్బులు లేక‌పోతే బ్యాంకుకు 10,000 ఫైన్‌

sridhar

వికేంద్రీకరణ సమర్థిస్తూ రావులపాలెంలో ర్యాలీ

somaraju sharma