ఇప్పటివరకూ కనీవినీ ఎరుగని చోరీ..! దెబ్బకు రూ.1.25 లక్షల కోట్లు నష్టం

మనదేశంలో ఎన్నో రకాల చోరీలు చూశాం. స్కాం లు వాటిని తలదన్నే కుంభకోణాలు మనకు కాలంతో పాటు ఎదురు పడ్డాయి. అయితే ప్రస్తుతం అందరి ఒళ్ళు గగుర్పొడిచే స్కాం ఒకటి బయట పడింది. దీనిని స్కాం అనడం కన్నా ఇండివిడ్యువల్ చోరీ అనడం ఉత్తమం. అసలు ఇది ఏ రకమైన దొంగతనం…? ఎన్ని కోట్లు నష్టం ఆ వాటిల్లింది అన్న వివరాలను ఒక్కసారి చూస్తే…

 

టెక్నాలజీ తోనే దొంగతనం

సైబర్ క్రైమ్ పేరు వినే ఉంటారు. ఇది మన వరకు రాలేదు కాబట్టి మనకు దీని గురించి పెద్దగా తెలియదు అయితే దీనిని ఎదుర్కొన్న వారు మాత్రం కోట్లలో డబ్బులు నష్టపోతారు. 2019లో ఒక్క భారతదేశంలోనే ఈ సైబర్ క్రైమ్ వల్ల అక్షరాల 1.25 లక్షల కోట్ల రూపాయలు చోరీ చేశారు అంటే ఎవరైనా నమ్ముతారా కానీ ఇది నిజం. నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేట్ లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పంత్ చెప్పిన దాని ప్రకారం నిజంగా 1.25 లక్షల కోట్ల రూపాయలు గత సంవత్సరం ఈ సైబర్ క్రైం వల్ల దేశం నష్టపోయింది. వ్యక్తుల దగ్గర నుండి కంపెనీల వరకు ఎంతో డేటాను వీరు చోరీ చేసి వేసినట్లు సమాచారం.

కారణాలెన్నో…

రాజేష్ మాట్లాడుతూ స్మార్ట్ సిటీలు, 5g వంటి టెక్నాలజీలు వచ్చిన తర్వాత సైబర్ నేరగాళ్ల తమ ఆటను మరింత వేగవంతం చేశారు. ఎన్నోరకాలుగా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వారు ఈ సైబర్ క్రిమినల్స్ ను పట్టుకునేందుకు ప్రణాళికలు వేస్తున్నారు కానీ వాటితో నష్టాన్ని తగ్గించగలిగారు తప్ప పూర్తిగా దీనికి సొల్యూషన్ కనుక్కోలేదు. ఇది ఏ తరహా లో జరుగుతుందో చెప్పడం కష్టం మనం అలా రిలాక్స్ అయితే చాలు కళ్ళు మూసి తెరిచేలోపు అకౌంట్ లో ఉన్న డబ్బులు మాయం అవుతాయి లేదా విలువైన డేటా చోరీ జరిగింది జరగాల్సిన నష్టం మొత్తం కేవలం రెప్పపాటులో జరిగిపోతుంది.

వాళ్ళతో పాటు మనం జాగ్రత్తపడాలి…

రాజేష్ చెబుతున్న దాని ప్రకారం కొన్ని కంపెనీలు మాత్రమే సైబర్క్రైమ్ నుండి రక్షణ ఉండేలా ప్రొడక్ట్స్ రూపొందిస్తున్నాయి అని చాలామంది ప్రోటోకాల్ పాటించకుండా ఎన్నో ప్రొడక్ట్స్ సైబర్ క్రైమ్ వారికి డేటాను దొంగలించేందుకు అవసరమైన సెక్యూరిటీ అంశాలను తీసుకోవటం లేదని అన్నారు. అలాగే మన మొబైల్ ఫోన్స్ లో కూడా కేవలం సాఫ్ట్వేర్ హ్యాకింగ్ ద్వారానే కాకుండా వై-ఫై, బ్లూటూత్, హార్డ్వేర్, మెమొరీ కార్డులు వంటి అనేక అనుసంధానమైన నెట్వర్క్ ల ద్వారా కూడా జరిగే అవకాశం ఉంది. మనకి ఎలా జరిగింది అని తెలిసేలోపలే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త…!