NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Undavalli Arun Kumar: రాష్ట్ర విభజనపై మోడీ వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందించిన ఉండవల్లి..ఘాటు వ్యాఖ్యలు..

Undavalli Arun Kumar: రాష్ట్ర విభజన అంశంపై మాజీ ఎంపి, సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ మరో సారి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజనపై రాజ్యసభలో ప్రధాన మంత్రి మోడీ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీనే అడ్డగోలుగా రాష్ట్ర విభజన జరిగిందని, విభజన సమస్యలు అలానే ఉన్నాయని మాట్లాడినప్పుడైనా రాష్ట్రంలోని పార్టీలు పార్లమెంట్ వేదికగా ఎందుకు మాట్లాడలేకపోతున్నారని ఉండవల్లి ప్రశ్నించారు. విభజన బిల్లు ఆమోదం సమయంలో పార్లమెంట్ లో జరిగింది మామూలు తప్పు కాదు ఘోరమైన తప్పు జరిగిందన్నారు. చర్చ జరగకుండా రాష్ట్ర విభజన ఏమిటి అని నాడు బీజేపీ కూడా మాట్లాడలేదన్నారు.

Undavalli Arun Kumar serious comments on state bifurcation issue
Undavalli Arun Kumar serious comments on state bifurcation issue

Undavalli Arun Kumar: వైసీపీ, టీడీపీ ఎంపీలు లోక్ సభలో నోటీసు ఇవ్వాలి

కేవలం రాజకీయ లబ్దికోసమే కాంగ్రెస్, బీజేపీలు ఏపిని విడగొట్టాయని ఆయన మండిపడ్డారు. విభజన వల్ల ఏపికి పూర్తిగా అన్యాయం జరిగిందన్నారు. చర్చ లేకుండానే విభజన బిల్లు ఆమోదించారనీ, రాజధాని లేకుండానే ఒక రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారని ప్రశ్నించారు. ఏపిలో ఉన్న అన్ని పార్టీలు బీజేపీకి మద్దతుగా ఉన్నాయని విమర్శించారు. రాష్ట్ర సమస్యలపై వైసీపీ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు.  ఇప్పటికైనా ప్రధాని మోడీ వ్యాఖ్యలపై చర్చ జరిగితే ఏపికి జరిగిన అన్యాయం దేశానికి తెలుస్తుందన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరిగి ఏనిమిదేళ్లు అయ్యిందనీ ఇప్పటికైనా దీనిపై వైసీపీ, టీడీపీ ఎంపీలు లోక్ సభలో ఒక నోటీసు ఇవ్వాలన్నారు. ఏపికి అన్యాయం జరిగిందంటూ మోడీ చెప్పింది వాస్తవమనీ, ఆయన మాటలను పూర్తిగా సమర్ధిస్తూనే నోటీసు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందినప్పుడు సభలో తలుపులు మూసేస్తే జరిగిన పరిణామాలు ఏంటో బయట పెట్టాలన్నారు.

YS Jagan: CM Planning Grand New Ugadi 2022..

మౌనంగా ఉంటే ముందు తరాలు దారుణంగా నష్టపోతాయి

అన్యాయంపై అడగడానికి భయమెందుకు అని ఉండవల్లి ప్రశ్నించారు. మౌనంగా ఉంటే ముందు తరాలు దారుణంగా నష్టపోతాయని ఉండవల్లి అన్నారు. ఆంధ్రాకు ఏమి చేసినా అడిగేవారు లేరని అనుకుంటారని అన్నారు. జరిగిన నష్టంపై కోర్టుకీ వెళ్లరని పేర్కొన్నారు. తాను కోర్టులో పిటిషన్ వేస్తే రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ వేయలేదన్నారు. నాడు చంద్రబాబు హయాంలో కౌంటర్ వేయలేదు. ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా కోర్టులో కౌంటర్ వేయలేదన్నారు. ప్రశ్నించే ప్రాంతీయ పార్టీల నేతలపై బీజేపీ కేసులు పెడుతోందని, రాబోయే రోజుల్లో ఏపిని అసలు పట్టించుకోరని ఉండవల్లి అన్నారు. జగన్మోహనరెడ్డి కేంద్రానికి ఎందుకు భయపడుతున్నారో అర్ధం కావట్లేదని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!