Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “బద్రి” సినిమాతో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమైన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ స్టైల్ .. మేనరిజమ్స్ ఈ సినిమాతో పూర్తిగా మారిపోయాయి. ఈ సినిమా రాకముందు వరకు పవన్ కళ్యాణ్ క్రేజ్ ఒకలా ఉంటే “బద్రి” సినిమా వచ్చాక.. యూత్ లో మరింత ఫాలోయింగ్ పవన్ కి ఏర్పడింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో దాదాపు 12 సంవత్సరాలు లాంగ్ గ్యాప్ తర్వాత.. పూరి జగన్నాథ్ కెమెరామెన్ గంగతో రాంబాబు అనే సినిమా చేశారు. ఈ సినిమా అభిమానులు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.
బద్రి సినిమా తర్వాత చాలా కాలం పవన్ కళ్యాణ్ పూరి కాంబినేషన్ లో సినిమాలు చర్చల దాక వచ్చి మధ్యలో పోయాయి. ఈ క్రమంలో పూరి చెప్పిన సినిమాలను మిస్ చేసుకున్న పవన్…కి చాలావరకు బ్యాడ్ లక్ ఎదురయింది. ఎందుకంటే పవన్ మిస్ చేసుకున్న చాలా సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర విజయాలు సాధించడం మాత్రమే కాక ఇండస్ట్రీ రికార్డులు కూడా అయ్యాయి. ఇదిలా ఉంటే మరో సారి పూరీ దర్శకత్వంలో పవన్ ఇప్పుడు సినిమా చేయడానికి రెడీ అయినట్లు సమాచారం.
Read More: Pawan kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీస్ తారుమారవుతున్నాయా..?
ఈ సినిమాని ఠాగూర్ మధు నిర్మించనున్నట్లు ఇటీవలే పవన్ కళ్యాణ్ కి పూరి స్క్రిప్ట్ వినిపించినట్లు ఫస్ట్ సిటింగ్ లోనే పవన్ కళ్యాణ్ కి విపరీతంగా నచ్చినట్లు త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. రానా తో మల్టీస్టారర్ సినిమా చేస్తూ మరో పక్క క్రిష్ సినిమా “హరిహర వీరమల్లు” చేస్తున్నారు. ఈ రెండూ పూర్తయిన తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తూ ఉండగానే మరోపక్క పూరి సినిమా స్టార్ట్ చేసే ఆలోచనలో పవన్ ఉన్నట్లు టాక్.