NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

TDP: పార్టీలో చంద్రబాబుకి ఊహించని షాక్ ఇస్తున్న యువ నేతలు..!!

unexpected shock to chandrababu from young leaders

TDP: టీడీపీ TDP చంద్రబాబు నిర్ణయాలకు పార్టీలో వ్యతిరేకత వస్తోందా? అంటే పరిస్థితులు అవుననే అంటున్నాయి. పార్టీని ఇన్నేళ్లు నడిపించిన నాయకుడిగా.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు అనుభవం ఉంది. 1995 నుంచీ ఆయన ఆలోచనలే పార్టీకి బలం. కానీ.. ప్రస్తుతం ఆయన నిర్ణయాలకు ఎదురు చెప్పలేక సీనియర్లు, వ్యతిరేకిస్తూ కొత్త తరం.. పార్టీని సందిగ్దంలో పడేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇటివల జరిగిన మహానాడు ఇందుకు వేదికైంది. నిజానికి పార్టీలోకి ఈసరికి కొత్త తరం ఉండాలి.. నిర్ణయాలు ప్రజలకు కొత్తగా ఉండాలి. కానీ.. చంద్రబాబు.. పాతికేళ్లనాటి ఆయన టీమ్ ఇప్పటికీ నడుస్తోంది. దీంతో లోకేశ్ కు చంద్రబాబుకు తీసుకునే నిర్ణయాల్లో వ్యతిరేకత వస్తుందని అంటున్నారు.

unexpected shock to chandrababu from young leaders
unexpected shock to chandrababu from young leaders

మహానాడులో హైలైట్ అయిన విషయం అంటే.. అంశాల వారీగా బీజేపీకి మద్దతిస్తాం అని ప్రకటన చేశారు. అయితే.. చంద్రబాబు అండ్ టీమ్ కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బీజేపీ నుంచి వచ్చిన యాంటీ రియాక్షన్ చంద్రబాబుకే షాక్ ఇచ్చింది. ఈ అంశంపై టీడీపీ మాత్రమే కాదు.. అనుకూల మీడియా నుంచి కూడా మాట్లాడలేకుండా చేసేసింది బీజేపీ. ఇదే ఇప్పుడు టీడీపీలో బీజేపీపై లోకేశ్ వర్గం సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తోందని తెలుస్తోంది. బీజేపీపై వ్యతిరేక కమెంట్లు, పోస్టులు చేస్తూ చంద్రబాబు నిర్ణయానికి ఎదురెళ్తున్నారని అంటున్నారు. టీడీపీ అనుబంధ సోషల్ మీడియా గ్రూపుల్లో వస్తున్న పోస్టులే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. టీడీపీ సోషల్ మీడియా వింగ్ అంతా లోకేశ్ కంట్రోల్ లోనే ఉంటుందనేది తెలిసిన విషయమే.

Read More:NTR-Bharat Ratna: ఎన్టీఆర్ కు “భారతరత్న” డిమాండ్.. కుటుంబ డ్రామానా..? ఏటా ఇంతేనా..?

అంటే.. చంద్రబాబు బీజేపీతో స్నేహం కోసం చూస్తుంటే.. కొత్త తరం మాత్రం ఇందుకు వ్యతిరేకంగా ఉన్నారని తెలుస్తోంది. 2018లో కాంగ్రెస్ కు మద్దతివ్వడం, 2019లో మోదీకి వ్యతిరేకతంగా వెళ్లి రాహుల్ ను ప్రధాని చేద్దాం అనడం.. ఇప్పుడు బీజేపీతో స్నేహం కోసం చూడటం.. ఇవన్నీ చంద్రబాబు తప్పిదాలుగా టీడీపీ నవతరం భావిస్తోందని చెప్పాలి. ప్రస్తుతానికైతే పార్టీలోనూ.. తండ్రీకొడుకుల మధ్య విబేధాలు ఉన్నాయనే వార్తలు ఎక్కడా లేవు. కానీ.. టీడీపీ సోషల్ మీడియా వింగ్ పోస్టులు చూస్తూంటే మాత్రం చంద్రబాబు నిర్ణయాలు కొత్త తరానికి రుచించడం లేదనే సంకేతాలు వెళ్తున్నాయని చెప్పాలి. మరి.. రానున్న రోజల్లో పార్టీలో ఏం జరుగుతుందో చూడాలి.

author avatar
Muraliak

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!