Rajendraprasad: రాజేంద్రప్రసాద్ కెరీర్‌లో 100 ఏళ్ళు గడిచినా మర్చిపోలేని చిత్రం అదే

Share

Rajendraprasad: సినిమా ఇండస్ట్రీలో కామెడీకి రాజేంద్రప్రసాద్ కేరాఫ్ అడ్రెస్ గా నిలిచారనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరో అయ్యేందుకు నందమూరి తారక రామారావు గారి స్పూర్తి. నటనలో మెళకువలు నేర్చుకోకుండా మొహానికి రంగేసుకోకూడదు..అనే ఆలోచన దేవదాసు కనకాల యాక్టింగ్ స్కూల్ వరకు తీసుకువెళ్ళింది. యాంక్టింగ్ లో పట్టా పొందారు. ప్రత్యేకించి మైమ్ యాక్టింగ్‌లో స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు. ఆ అనుభవంతో ప్రేమించు పెళ్లాడు సినిమాతో హీరోగా మారారు. అప్పటి వరకు కామెడీ అనేది కేవలం సినిమాలో మాత్రమే ఉండేది.

unforgettable movie of rajendraprasad for 100 years
unforgettable movie of rajendraprasad for 100 years

కానీ రాజేంద్రప్రసాద్ వచ్చాక సినిమానే కామెడీతో నింపేశారు. నవ్వుల రారాజుగా, రాజేంద్రుడుగా అందరి హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారు. రాజేంద్రప్రసాద్ మొదటి సినిమా ప్రముఖ దర్శకులు బాపు రూపొందించిన స్నేహం. ఈ సినిమా 1977 సెప్టెంబరు 5న విడుదలైంది. ఇందులో రాజేంద్రప్రసాద్ పాత్రకి మంచి పేరు వచ్చింది. దాంతో చిరంజీవి నటించిన మంచుపల్లకి, ఈ చరిత్ర ఏ సిరాతో, పెళ్ళి చూపులు, రామరాజ్యంలో భీమరాజు వంటి సినిమాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. వీటితో తన సత్తా చాటి బాగా పాపులర్ అయ్యారు.

రాజేంద్రప్రసాద్ కామెడీ టైమింగ్ చూసిన దర్శకులు, ఆయనతో హాస్యాన్నే ప్రధానంశంగా తీసుకుని సినిమాలు రూపొందించారు. వీటి ద్వారా రాజేంద్ర ప్రసాద్ మంచి విజయాలను అందుకున్నారు. ప్రముఖ దర్శకులు జంధ్యాల, రేలంగి నరసింహారావు, ఈవీవీ సత్యనారాయణ, బాపు లాంటి అగ్ర దర్శకులు రూపొందించిన సినిమాల్లో నటించి గొప్ప పేరు సంపాదించుకున్నారు. చెవిలో పువ్వు, ముత్యమంత ముద్దు, పేకాట పాపారావు, అత్తింట్లో అద్దె మొగుడు, ఏప్రిల్ 1 విడుదల, అప్పుల అప్పారావు లాంటి సినిమాలు రాజేంద్రప్రసాద్‌కి స్టార్ డం తీసుకువచ్చాయి. మాయలోడు, లేడీస్ టైలర్, ఆ ఒక్కటీ అడక్కు, రాజేంద్రుడు గజేంద్రుడు ఆయన కెరీర్‌ని మరో స్థాయికి తీసుకు వచ్చాయి.

ఇదే క్రమంలో వచ్చిన ఎర్ర మందారం రాజేంద్రప్రసాద్‌లో మరో కోణాన్ని బయటకు తీసుకు వచ్చింది. కొబ్బరి బోండాం, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళం, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, ఖుషీ ఖుషీగా, సరదా సరాదాగా, శ్రీరామ చంద్రులు సినిమాలతో రాజేంద్రప్రసాద్ కి వరుసగా హిట్స్ అందుకున్నారు. ఒకదశలో కంటిన్యూగా ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను నమోదు చేశాయి. అంతేకాదు నిర్మాతలు భారీగా లాభాలు పొందారు. ఆయన కెరీర్ లో మేడం, పెళ్ళి పుస్తకం ఎన్ని వందల ఏళ్ళు గడిచినా మర్చిపోలేరు. ముఖ్యంగా పెళ్ళి పుస్తకంలోని శ్రీరస్తు శుభమస్తు కలకాలం నిలిచిపోతుంది.

రాజేంద్రప్రసాద్ హాలీవుడ్ సినిమా క్విక్ గన్ మురుగన్ కెరీర్‌లో మరో మంచి సినిమా. హాలీవుడ్ సినిమా అయినా దీనికి ఆయన అందుకున్న రెమ్యునరేషన్ కేవలం 35 లక్షలు మాత్రమేనట. అంతేకాదు ఇదే ఆయన ఇప్పటి వరకు అందుకున్న హైయ్యెస్ట్ రెమ్యునరేషన్. ఇది తెలిసిన ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోవాల్సిందే. దీనిని బట్టి అర్థమవుతోంది ఎంత స్టార్ డం ఉన్నా రెమ్యునరేషన్ విషయంలో అసలు డిమాండ్ చేయరని. ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి లాంటి సినిమాలు కేవలం రాజేంద్రప్రసాద్ మాత్రమే చేయగలరని ఇండస్ట్రీ మొత్తం ప్రశంసలతో ముంచెత్తారు. హీరోగా అద్భుతమైన సినిమాలు చేసిన రాజేంద్రుడు ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగాను విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నారు. జులాయి, నాన్నకు ప్రేమతో, శ్రీమంతుడు, సుప్రీం, శమంతకమణి, కౌసల్య కృష్ణమూర్తి, సరిలేరు నీకెవ్వరు, సోలో బ్రతుకే సో బెటర్, గాలి సంపత్, మిస్ ఇండియా లాంటి సినిమాలలో ఆయన అద్భుతమైన పాత్రలు పోషిస్తూ కొనసాగుతూ ఉన్నారు నట కిరీటి డా.రాజేంద్రప్రసాద్.


Share

Related posts

కెసిఆర్ కి ప్రధాని మోడీ శాంపిల్ డోస్ ?అవాక్కైన గులాబీ బాస్!!

Yandamuri

Eesha Rebba Red Saree latest HD Photos

Gallery Desk

ఓ పోలీసు బిడ్డా….నిన్ను మరవదు తెలుగు గడ్డ!నిజమైన ఖాకీ నువ్వేనయ్యా!

Yandamuri