ఊహించని షాక్ ఇవ్వబోతున్న కొత్త సంవత్సరం.. భారీగా పెరగనున్న ధరలు!

Share

Price Hike: కొత్త సంవత్సరంలో అడుగుపెట్టడానికి మరో నెల రోజులు మాత్రమే మిగిలి ఉన్నది. అయితే, వచ్చే ఏడాది ప్రారంభంలో సామాన్యులకు ఊహించని షాక్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం మరోసారి సిద్ధమైనట్టు తెలుస్తోంది. కరోనా మమహ్మరి ఏమంట దేశంలో అడుగుపెట్టిందేమో కానీ సామాన్యులకు వరుస షాక్స్ తగులుతూనే ఉన్నాయి. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు పోయి చాలా మంది రోడ్డున పడ్డారు. ఇక ఇప్పుడిప్పుడే మళ్లీ అంతా సెట్ రైట్ అవుతుందనుకున్న క్రమంలో ధరల పెరుగుదల సామాన్యుడి నడ్డి విరుస్తోంది. ఇంధన ధరలు, వంట నూనె, గ్యాస్, కూరగాయల ధరలు ఆకాశన్నంటుతున్నాయి.

కొత్త ఏడాది కూడా బాదుడే..

 

వచ్చే ఏడాది ప్రారంభంలో కూడా ధరలు పెరగనున్నట్టు తెలుస్తోంది. GST పెంపే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ ప్రభావం కాస్త సామాన్య ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చునని తెలుస్తోంది. ముఖ్యంగా బట్టలు, టెక్స్‌టైల్స్, ఫుట్‌వేర్ ధరలు కొత్త ఏడాది ప్రారంభంలో పెరుగనున్నాయి. CBDT (సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్) ఈ వస్తువులపై GSTపెంచడమే ఇందుకు ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. CBDT ప్రస్తుతం వస్తు సేవలపై 5 శాతం పన్నును 12 శాతానికి పెంచింది. ఈ నిర్ణయం 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది.

GST పెంచకపోయినా ధరల పెరుగుదల కామన్..

GST కౌన్సిల్ సెప్టెంబర్ నెలలో ఈ నిర్ణయం తీసుకోగా, జనవరి 1 నుంచి బట్టలపై జీఎస్‌టీ 12 శాతంగా ఉండనుంది. దీంతో రూ. వెయ్యిలోపు ఉన్న దుస్తులపై కూడా ధరలు భారీగా పెరుగుతాయి. ఇకపోతే టెక్స్‌టైల్ పరిశ్రమపై కూడా ఒడిదుడుకుల్లో ఉంది. ముడి పదార్ధాల ధరలు మండిపోతున్నాయి. యార్న్, ప్యాకేజింగ్ మెటిరియల్ ధరలు కూడా పెరగడం, దీనికి తోడు ఇంధన ధరలు పెరగడంతో రవాణా చార్జీలు కూడ పెరిగాయి. జీఎస్‌టీ వలన కూడా ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నాయి. జీఎస్‌టీ పెంపును పరిగణలోకి తీసుకోకున్నా ధరలు 12 నుంచి 15 శాతం మేర పెరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి.


Share

Related posts

ఎన్ఐఎ కస్టడీకి జగన్‌పై దాడి కేసు నిందితుడు

somaraju sharma

ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో ఎలైన్ మాస్క్ సంచలన నిర్ణయం..!

bharani jella

యమహా నీ యమా యమా అందం..! సూపర్ బైక్ దించిన యమహా..!! ఫీచర్లు ఇవే

bharani jella