దేశ రాజధాని ఢిల్లీలోని ఏపి భవన్ విభజనపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు చేసింది. ఈ మేరకు ఏప్రిల్ 26న కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం వివరాలను విడుదల చేసింది. ఏపి భవన్ కు సంబంధించి మొత్తం 19.73 ఎకరాల్లో 12,09 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ కు. 7.64 ఎకరాలు తెలంగాణకు ఇవ్వాలని కేంద్రం ప్రతిపాదించింది. ఏపి భవన్ విభజనకు ఏపి ప్రభుత్వానికి మూడు, తెలంగాణ ప్రభుత్వానికి రెండు ఆప్షన్లు ఉన్నట్లు తెలిపాయి. అయితే కేంద్రం ఆప్షన్ – ఈ తో ముందుకు వచ్చింది. కేంద్ర ప్రతిపాదన ఏపి స్వాగతించింది.

అయితే తెలంగాణ ప్రభుత్వ అభీష్టానికి వ్యతిరేకంగా కేంద్రం తాజా ప్రతిపాదన చేయడంతో సమ్మతి వ్యక్తం చేస్తుందా లేదా అనేది ఇంకా తెలియరాలేదు. తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందిస్తే తుది నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయాలను వీలైనంద త్వరగా తెలపాలని కేంద్రం కోరింది. తద్వారా సమస్య పరిష్కారానికి సహకరించాలని సూచించింది. ఆప్షన్ డీ లో భాగంగా పటౌడీ హౌస్ భూమి 7,64 ఎకరాలు మినహా ఇప్పటికే ఉన్న భవనాలు 12.09 ఎకరాలతో పాటు గోదావరి బ్లాక్, శబరి బ్లాక్, నర్సింగ్ హాస్టల్ తో కూడిన మొత్తం భూమిని తెలంగాణ కోరుకుంటోంది.
జనాభా నిష్పత్తి ప్రకారం తమకు రావాల్సిన దానికంటే ఎక్కువ కోరుకుంటున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు ఆర్ధిక సర్దుబాటు తెలంగాణ చేస్తామని చెప్పిందని పేర్కొంది. అయితే కేంద్ర ఆప్షన్ – ఈ కింద పటౌడీ హౌస్ మొత్తం 7,64 ఎకరాలు తెలంగాణకు. గోదావరి, శబరి బ్లాకులు ఉన్న భూమి సహా నర్సింగ్ హాస్టల్ కలిపి 12.09 ఎకరాలు ఏపికి అని ప్రతిపాదించింది.
AP Govt: ఏపిలో నేడు ఆ లబ్దిదారులకు ఆర్ధిక సాయం నిధులు విడుదల