NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

ఆహా…అనంతకుమార్ హెగ్డే…మహానుభావా!

 

మంచీ చెడూ తేడా లేకుండా మాట్లాడి వార్తల్లోకి ఎక్కే వ్యసనం ఉన్న కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే తాను ఎంత అధమ స్ధాయికి వెళ్లగలనో మరోసారి నిరూపించారు. హిందూ యువతిని ఎవరైనా తాకితే ఆ తాకిన చేయి తీసేయాలని ఆయన ఒక సభలో అన్నారు. దానిపై కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు దినేష్ గుండూరావు స్పందించినందుకు ఆయన ముస్లిం భార్యను కేంద్ర మంత్రి వివాదంలోకి లాగారు. ఆయన సంస్కారం అంతలో ఉంది మనం ఏం చేయగలం అని గుండూరావు వ్యాఖ్యానించారు.

కర్నాటకలోని కొడగు జిల్లాలో అనంతకుమార్ ఆదివారం ఒక సభలో ప్రసంగించారు. ‘మనం మన ప్రాధామ్యాలను పునరాలోచించుకోవాలి. కులాలు పక్కన పెట్టాలి. హిందూ యువతిని ఎవరైనా తాకితే ఆ తాకిన చేయి తీసేయాలి’, అని ఆయన అన్నారు. ‘తాజ్‌మహల్ కట్టింది ముస్లిం రాజులు కాదు. తను రాజా జయసింహ నుంచి ఆ భవనాన్ని కొనుగోలు చేసినట్లు షాజహాన్ తన ఆత్మకథలో రాసుకున్నాడు. అది పరమతీర్ధ రాజు నిర్మించిన శివాలయం, తేజోమహాలయ. తేజోమహాలయ కాస్తా తాజ్‌మహల్ అయింది. మనం నిద్రపోతే మన ఇళ్లను మంజిల్ అంటారు. రాముడ్ని జహాపనా అంటారు. సీతను బీబీ అంటారు’, అని మంత్రి వ్యాఖ్యానించారు.

ఈ ప్రసంగంపై స్పందించిన గుండూరావు ట్విట్టర్‌లో, ‘కేంద్ర మంత్రి అయిన తర్వాత కర్నాటకకు మీరు చేసింది ఏమిటి. మీరు సాధించిన విజయాలు ఏమిటి’ అని ప్రశ్నిస్తూ, ఇలాంటి వ్యక్తులు ఎంపీలుగా గెలిచి మంత్రులు కావడం శోచనీయమని పేర్కొన్నారు.

దీనికి ట్విట్టర్‌లోనే మంత్రి స్పందించారు: ‘ఇతని ప్రశ్నలకు తప్పనిసరిగా జవాబిస్తాను. దానికి ముందు తాను ఎవరో చెప్పాలి. ఇతగాడు ఒక ముస్లిం యువతి వెంట పడినవాడని నాకు తెలుసు’ ముస్లిం యువతి అన్న ప్రస్తావన గుండూరావు భార్య తబూ రావును ఉద్దేశించినది.

ఈ దాడికి స్పందించిన గుండూరావు, ‘వ్యక్తిగత విషయాలు బజారుకీడ్చే స్థాయికి మంత్రి దిగజారడం చాలా విచారకరం. అతని సంస్కారం అంత స్థాయిలో ఉంది. హిందూమత గ్రంధాల నుంచి అతడేమీ నేర్చుకున్నట్లు లేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రయత్నిస్తే హుందాతనం నేర్చుకోవచ్చు’ అని వ్యాఖ్యానించారు.

అనంతకుమార్ హెగ్డే ఇలా అనుచితంగా మాట్లాడడం కొత్తేం కాదు. శబరిమల వివాదంలో కేరళ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు హిందువులను పట్టపగలు రేప్ చేయడమేనని ఆయన ఆ మధ్య అన్నారు.గత సంవత్సరం తన కారును ఆపినందుకు దళితులను రోడ్డుపై మొరిగే కుక్కలుగా అభివర్ణించారు. దాని తర్వాత ప్రతిపక్షాలను ఉద్దేశించి, పులిలాంటి నరేంద్ర మోదీపై పోరాటానికి వచ్చిన కాకులు, కోతులు, నక్కలు అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజ్యాంగంలోనుంచి సెక్యులర్ అనే పదాన్ని తొలగించేందుకు రాజ్యాంగ సవరణ 2017 లో ఆయన అన్న మాట పెద్ద వివాదానికి దారి తీసింది.

తాజా వివాదంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా స్పందించారు. ఇతను మంత్రిగా ఉండేందుకు అనర్హుడు అని ఆయన  వ్యాఖ్యానించారు.

 

author avatar
Siva Prasad

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

Leave a Comment