NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

తాగితే మాయ… తాగుతుంది మాయే ; ఏపీలో అంతే ఏపీలో అంతే !!

 

 

తాగితే మత్తు.. అదో మాయ… తాగేందుకు ఎత్తులు.. అదో మాయ… తాగక చిత్తులు … అదో మాయ… తాగడానికి జిత్తులు ఇదో మాయ… అసలు మందే మాయ… అసలు ఎం తాగుతున్నామా అన్నాడు మాయ… కడుపులోకి ఎం వెళ్తుంది అన్నది మాయ… అంతా మాయ.. అన్ని మాయ… ఆంధ్ర లో మద్యం ఒక మాయ… అమ్మకం మరో మాయ… అమ్మేవారు ఇంకో మాయ…. ఈ మాయ ప్రపంచంలోకి ఒక సరి వెళ్ళొద్దాం రండి…

 

పైన బీరు బోటిల్ చూసారా ??

రెండు రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్ మద్యం దుకాణాల్లోకి వచ్చింది. పేరు అడగకండి…. రాస్తున్న మాకే నోరు తిరిగి చావడం లేదు.. చబీచు .. చాబాచు … చాచు… ఏదోలెండి … మనకెందుకు… ఐనా ఆంధ్ర మద్యం దుకాణాల్లో పేరు చెబితే మద్యం అమ్మే రోజులు ఎప్పుడో పోయాయి కదా..!! కేవలం 100 దా… 180 … 200 దా… లేక పైన అని అడిగితే ఉన్నా ఏవో ఏవేవో బ్రాండ్లు అమ్మడమే కదా… అవును ఈ పేరు కూడా తెలియని ఈ కొత్త, వింత బ్రాండ్లు ఆంధ్రకు ఎక్కడి నుంచి వస్తున్నట్లు..? అసలు గుర్తు కూడా తెలియని బ్రాండ్లు ఎలా వస్తున్నాయి..? ఒకసారి చూద్దాం రండి…
** పైన బోటిల్ గురించి చెప్పుకున్నాం కదా… అది నిజానికి అంతర్జాతీయ బ్రాండ్ బీరు… నిజమండి… భూటాన్ కి చెందిన సంస్థ తయారు చేస్తుంది. అందుకే దాని పేరు కూడా పలకడానికి వీలు లేనంతగా ఉంది.. మరి ఇంటర్నేషనల్ బ్రాండ్ ఎక్కడికి ఎలా వచ్చింది… మీరు ఏదో చెప్తారు గాని ఇంటర్నేషనల్ బ్రాండ్ తాగడం పెద్ద విషయం కదా అండీ… అనుకోకండి..
** నిజానికి అది బుటాన్ నుంచి వచ్చిన దిగుమతి అయినా బీరు కాదు… అక్కడి బ్రాండ్ ను ఇక్కడికి తీసుకువచ్చి ఆ కంపెనీ పేరు మీద లోకల్ మద్యం నింపి పోస్తున్న బీరు.. అంటే ఫ్రాంచైజీ మోడల్ అన్నట్లు… ఒక కంపెనీ పెట్టి… దానికి రకరకాల అనుమతులు తీస్కుని పెద్ద హంగామా చేసి కోట్లు ఖర్చు చేసే కన్నా, కేవలం ఏపీలో లేని కంపెనీ ల ఫ్రాంచైజీలు తీసుకోవడం… లోకల్ గా ఒక యూనిట్ స్టార్ట్ చేసి మద్యం తయారు చేయడం ఏపీ లో అధికార పార్టీ నాయకులూ చేస్తున్నపని..


** ఏపీలో ఎలాగూ కంపెనీల బ్రాండ్లు అమ్మడం లేదు. దొరకడం లేదు. ప్రభుత్వమే పిచ్చి పిచ్చి బ్రాండ్లు ప్రోత్సహాహిస్తోంది. దింతో ఇతర రాష్ట్రాల్లో ఉన్నా చిన్న చిన్న రిజిస్ట్రార్ కంపెనీల పేరును వాడుకుని మద్యం లోకల్ గా తయారు చేయడం పెద్ద వ్యాపారం అయిపొయింది. (ఉదా ; ఏపీ మద్యం దుకాణాల్లో కింగ్స్ వెల్ బ్రాందీ అనేది దొరుకుతుంది… ఇది 200 రూపాయలు… ఇది తమిళనాడుకి చెందిన బ్రాండ్. అక్కడ 80 రూపాయలకు క్వార్టర్ .. ఇక్కడ అదే పేరు 200 . తమిళనాడు కు చెందిన గ్రామీణ ప్రాంతంలో తయారయ్యే ఈ మద్యం బ్రాండ్ ని నెల్లూరు కి చెందిన ఓ వ్యాపారి కేవలం 50 లక్షలు ఇచ్చి బ్రాండ్ ని దక్కించుకున్నారు. యూనిట్ నెల్లూరు , తూర్పు గోదావరిలో పెట్టి తయారు చేస్తున్నారు ) ఇది ఒక బ్రాండ్ మాత్రమే కాదు… చాల బ్రాండ్స్ ది ఇదే దారి.
** కొన్ని చీప్ లిక్కర్ బ్రాండ్స్ అయితే కేవలం కంపెనీ రిజిస్ట్రేషన్ చేసి .. అత్యంత నాసిరకంగా తయారు చేస్తున్నారు. చీప్ లిక్కర్ సైతం 180 ఉన్నా… 80 విలువ చేసే మద్యం నాణ్యత కనిపించడం లేదు. కంపెనీ రిజిస్ట్రేషన్ పెట్టి తయారీ మద్యానికి సంబంధం లేకున్నా.. అలా చేయడం చట్ట విరుద్ధం అయినా పట్టించుకునే వారు లేరు… దాన్ని అడిగే వారు అసలే లేరు…
** మద్యం తయారీ.. వ్యాపారం చేస్తున్న వారిలో అందరు అధికార పార్టీ నాయకుల బంధువులు, అనుచరులు, మిత్రులే. ఎక్కువమంది తమ పేరు మీద కాకుండా వేరే వారి పేరు మీద పెట్టి వ్యాపారం చేస్తున్న మొత్తం పెట్టుబడి అధికార పార్టీ నాయకులదే …..

author avatar
Comrade CHE

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju