యూపీ పాలకులు అవమానిస్తున్నారు!

యూపీలో అధికారంలో ఉన్న బీజేపీ నేతల వ్యవహార శైలి బలహీన వర్గాలను అవమానించేదిగా ఉందని అప్నాదళ్ అధినేత అషిష్ పటేల్ తీవ్రంగా విమర్శించారు. ఈ విషయంపై గతంలో పలుమార్లు ప్రధాని మోదీ దృష్టికి తీసుకువచ్చినా ఫలితం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

యూపీలో పాలకుల దుందుడుకు తీరుకు నిరసనగా రాష్ట్రంలో ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనరాదని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు. ఘజియాపూర్ లో ఈ రోజు మోడీ పాల్గొనే కార్యక్రమాన్ని కూడా తాము బహిష్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటికైనా తమ వినతిని పట్టించుకోవాలని, బలహీన వర్గాల పట్ల యూపీ పాలకుల తీరు మారాలని ఆయన  పేర్కొన్నారు. లేకుంటే ఆందోళనను తీవ్రం చేస్తామని హెచ్చరించారు.