NewsOrbit
న్యూస్

టీచర్లపై సస్పెన్షన్ వేటు

సోషల్ మీడియాలో రాజకీయ వ్యాఖ్యలు

పుల్వామా ఉగ్రవాద దాడిపై ప్రశ్నలు
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ పై ప్రశంసలు
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ టీచర్ల నిర్వాకం

లక్నో: పాఠాలు చెప్పుకోవాల్సిన టీచర్లు సస్పెండై ఇంట్లో కూర్చున్నారు. ఉత్తర ప్రదేశ్ లో ఏడుగురు టీచర్లు ఫేస్ బుక్, వాట్సాప్ గ్రూపులలో ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు పెట్టినందుకు సస్పెండయ్యారు. వాళ్లు పుల్వామా ఉగ్రవాద దాడిపై ప్రశ్నించడం, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను ప్రశంసించడం, బాలాకోట్ వాయుసేన దాడుల సమర్ధతను విమర్శించడం లాంటి పనులు చేశారు. గ్రూప్-ఎ విద్యాశాఖాధికారిని కూడా సస్పెండ్ చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు సస్పెండ్ చేయడంతో పాటు, ఒక ప్రైవేటు స్కూలు టీచరుపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. సస్పెండ్ చేయడానికి ముందు తగిన విచారణ చేశామని యూపీ అదనపు ముఖ్య కార్యదర్శి ప్రభాత్ కుమార్ ‘ద ఇండియన్ ఎక్స్ ప్రెస్’కు చెప్పారు.

ముజఫర్ నగర్ బీఎస్ఏ దినేష్ యాదవ్ ఫిబ్రవరి 21న సస్పెండయ్యారు. పుల్వామా ఉగ్రవాద దాడిని ప్రశ్నించడమే కాక, దానివెనుక ఏదో కుట్ర ఉందని వాట్సాప్ గ్రూపులో పెట్టారు. అది తన అధికార బాధ్యతను ఉల్లంఘించినట్లయింది. బారాబంకిలోని ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ సురేంద్రకుమార్ ఫిబ్రవరి 27న సస్పెండయ్యారు. ఒక సామాన్య పౌరుడిగా తాను పుల్వామా దాడి గురించి ప్రశ్నిస్తున్నానని వాట్సాప్ గ్రూపులో అన్నారు. ఇక సుల్తాన్ పూర్ ప్రాథమిక పాఠశాల అసిస్టెంట్ టీచర్ అమరేంద్రకుమార్ మార్చి 2న సస్పెండయ్యారు. శాంతి దూత ఇమ్రాన్ ఖాన్ కు సెల్యూట్ అని ఆయన టీచర్ల గ్రూపులో పెట్టాడు. ఇక రాయ్ బరేలీ ప్రాథమిక పాఠశాల అసిస్టెంట్ టీచర్ రవీంద్రకుమార్ మార్చి 6న సస్పెండయ్యారు. మన విమానం పాక్ లో కూలిపోయి, పైలట్ వారికి దొరికతే బాలాకోట్ ఎలా విజయవంతం అయినట్లవుతుందని ఫేస్ బుక్ లో ప్రశ్నించాడు. అది తాను రాయలేదని, తన ఫోన్ తీసుకుని ఎవరో రాశారని ఆయన అంటున్నాడు. ఇక మీర్జాపూర్ ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ రవిశంకర్ యాదవ్ అయితే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గురించి విమర్శించారు. నందజీ యాదవ్ అనే మరో ఉపాధ్యాయుడు ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గురించి పదే పదే అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇలాగే ఇంకా పలువురు ఉపాధ్యాయులు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసినందుకు సస్పెండయ్యారు.

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Leave a Comment