NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

‘కరోనా’పై ఉపాసన సూచనలు

హైదరాబాద్: ఉపాసన మరోసారి తన సామాజిక బాధ్యతని చూపించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా హైదరాబాద్‌కి  వచ్చేసిన నేపథ్యంలో ఆమె ట్విట్టర్ వేదికగా స్పందించి, జాగ్రత్తలు సూచించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, అపోలో లైఫ్ గ్రూపుల చైర్ పర్సన్ కొణిదెల ఉపాసన గతంలోనూ పలు సందర్భాల్లో ఇదే తరహాలో సామాజిక బాధ్యతని నిర్వర్తించారు. పేదలకు బట్టలు పంపిణీ, అంధులు, వికలాంగులకు అవసరమైన పరికారాలు, చిన్న పిల్లలకు క్రీడా పరికరాల పంపిణీ వంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు సోషల్ మీడియా ద్వారా  తన ఫాలోవర్స్‌కు అవగాహన కల్పిస్తున్నారు. ఆమె నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలకు దాదా సాహెబ్ ఫాల్కే సామాజిక సేవా పురస్కారాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

నేడు కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో తాజాగా తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో తొలి కేసు నమోదు అయ్యింది. దుబాయి నుండి బెంగళూరు ద్వారా హైదరాబాద్‌కు వచ్చిన ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌కు ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీనిపై కరోనా వైరస్ సోకిన పేషంట్ గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తూ ఉపాసన తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోను పోస్టు చేశారు. ఉపాసన ట్వీట్‌కు నెటిజన్‌ల నుండి విపరీతమైన స్పందన కనబడుతోంది. గంటల వ్యవధిలోనే వందలాది మంది రిట్వీట్ చేస్తూ ఆమెను అభినందిస్తున్నారు.

సదరు పేషంట్ ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. మిగతా రోగులకు అతన్ని దూరంగా ఉంచి, అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కరోనా ఇన్ఫెక్షన్ వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారనీ, ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజలు బాధ్యతగా ఉండి, ఏ మాత్రం వ్యాధి లక్షణాలు కనిపించినా, వైద్యులను సంప్రదించాలనీ కోరారు.

ఉపాసన చెప్పిన జాగ్రత్తలు

  • జలుబు, దగ్గు, జ్వరం, ఛాతిలో నొప్పి ఉంటే కరోనా సోకినట్లు భావించాలియ వెంటనే వారు వైద్యుడిని సంప్రదించాలి
  • ఈ వైరస్‌కు ఇప్పటి వరకూ ఎలాంటి మందు లేదు. మందులు వాడితే సరిపోతుందని భ్రమ పడకండి. వెంటనే ఆసుపత్రికి వెళ్లండి
  • హోమియోపతిలో ఉందని అంటున్నారు, కానీ ఇప్పటి వరకూ నిర్ధారణ కాలేదు
  • చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. మాస్కులు తప్పనిసరిగా వాడండి
  • జంతువుల ద్వారా ఈ వైరస్ సోకుతుందని అంటున్నారు కానీ ఇది ఇంత వరకూ నిర్ధారణ కాలేదు
  • మాంసం తినడం వల్ల కరోనా వైసర్ సోకదు. మాంసాన్ని బాగా ఉడికించి తినండి
  • మీ పిల్లలకు కానీ, పెద్ద వారికి కానీ దగ్గు, జ్వరం ఉంటే బయటకు వెళ్లనీయకండి
  • ఏదైనా అనుమానం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం, ఈ విషయాలను ప్రతి ఒక్కరికి తెలియజేయండి

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

Leave a Comment