‘గీతా గోవిందం ‘, ‘ఛలో ‘ మరియు ‘భీష్మ’ చిత్రాల విజయాలతో రష్మిక రేంజ్ టాలీవుడ్ లో బాగా పెరిగింది. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడంలో తనకి తానే సాటి అంటూ రష్మిక అభిమానులు తెగ పొగిడేస్తున్నారు. స్టార్ హీరోలు చాలా మంది వారి సినిమాల్లోకి ఆమెనే హీరోయినిగా కోరుకుంటూ ఉండడంతో ఈ ముద్దుగుమ్మ తన పారితోషికం కూడా బాగా పెంచేసింది. అయినప్పటికీ ఆమెకు చాలా ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా రష్మిక కి మరో స్టార్ హీరో సరసన నటించే అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది.
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలో రామ్ చరణ్ అతిథిగా పాత్ర పోషించనున్నాడన్న వార్తలు కూడా వచ్చాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడట. రామ్ చరణ్ ఇందులో విద్యార్థి నాయకుడుగా కనిపిస్తాడని మరియు ఆయన సరసన హీరోయిన్ కూడా వుంటుందట. ఈ పాత్ర కోసం రష్మికను సంప్రదించారని తెలుస్తుంది. పాత్ర నచ్చడంతో రష్మిక వెంటనే ఓకే చెప్పినట్టు తాజా సమాచారం.