న్యూస్ ఫ్లాష్ న్యూస్

రైల్వే సమయాలలో మార్పులు … చెక్ చేసుకోకపోతే ఇబ్బందిపడతారు..

రైల్వే సమయాలలో మార్పులు చెక్ చేసుకోకపోతే ఇబ్బందిపడతారు
Share

బ్రేకింగ్ న్యూస్… రెండు తెలుగు రాష్ట్రాలలో రైళ్ల సమయాల పట్టికలో భారీ మార్పులు జరిగాయి. విశాఖ నుంచి లేదా విశాఖ మీదుగా రాకపోకలు సాగే చాలా రైళ్ల సమయాలని మార్చారు. డిసెంబరు 1 నుంచి ఈ కొత్త టైమింగ్స్ ను అమల్లోకి తీసుకొస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు.

రైల్వే సమయాలలో మార్పులు … చెక్ చేసుకోకపోతే ఇబ్బందిపడతారు..

న్యూ ఢిల్లీ నుంచి విశాఖ వచ్చే ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రైలు వేగాన్ని పెంచి ఆ రైలు 45 నిమిషాల ముందే విశాఖకు చేరుకునేలా ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో ఇదే మార్గంలో నడిచే స్వర్ణజయంతి స్పెషల్‌ (02852) రైలును కూడా విశాఖకు 2.40 గంటలు ముందే చేరుకునేలా మార్పులు చేస్తున్నారు.

ఇదే విధంగా విశాఖ నుంచి కోర్బాకు వెళ్లే రైలు గంట ఆలస్యంగా విశాఖలో బయలుదేరనున్నది. కనీ కోర్బా నుంచి విశాఖకు వచ్చే రైలు 40 నిమిషాలు ముందే వచ్చేలా మార్పులు చేశారు. రైలుని విద్యుదీకరించడం ద్వారా రైలు వేగాన్ని కూడా పెంచనున్నారు.

విశాఖ-విజయవాడ వెళ్ళే రత్నాచల్‌ స్పెషల్‌ రైలును డిసెంబర్ 1 వ తారీకు నుంచి మారిన సమయాలతో అధికారులు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. విశాఖ మీదుగా వెళ్లే భువనేశ్వర్‌-బెంగళూరు ప్రశాంతి స్పెషల్‌ రైలుకి కూడా సమయాల్ని మార్చినట్లు తెలుస్తుంది కానీ దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.


Share

Related posts

ఆ నిధి..ఆ స్వామిజీదా…!! ఆశ్రమంలో కొట్టేసినదా..!!

DEVELOPING STORY

Relationship tips: మీవారు బిజీ గా ఉండి మీకు టైం కేటాయిన్చడం లేదని బాధ పడుతున్నారా?ఇలా చేయండి వారు మీ చుట్టూ తిరుగుతారు.

Kumar

Balakrishna: పుట్టినరోజు నాడు అభిమానులకు ట్రిపుల్ ధమాకా రెడీ చేసిన బాలయ్య బాబు..??

sekhar