Upendra: ఈ కన్నడ స్టార్‌కు నిజంగా ఇప్పుడు మెగాస్టార్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తుందా..? అంటే చెప్పలేము..అది మెగాస్టార్ చేతిలో ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం మెగాస్టార్ ఆయన కోసం అద్భుతమైన మాస్ ఎంటర్టైనర్ కథను తీసుకు వస్తే ఖచ్చితంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. అంతేకాదు యంగ్ టాలెంట్‌తో చిరు సినిమాలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర గురించి అందరికీ తెలిసిందే. A, ఉపేంద్ర, రా ఇలాంటి ఎన్నో డిఫరెంట్ జోనర్ చిత్రాలలో హీరోగా నటించి తనకంటూ సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.
ఇక టాలీవుడ్ ప్రేక్షకులకు ఆయన సుపరిచితుడే. తెలుగులో కూడా చాలా సినిమాలు చేశారు. ముఖ్యంగా ఉపేంద్రకు మెగా ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది. ఆ విషయాన్ని ఎప్పుడూ బయట పెట్టని ఉపేంద్ర తాజాగా మాత్రం గని పంచ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పుకొచ్చారు. గతంలో ఉపేంద్రకు మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినట్టే వచ్చి మిస్ అయిందని..ఇది నా జీవితంలో ఎప్పటికీ మిగిలిపే ఓ వెలితి అని చెప్పుకొచ్చారు. రాజశేఖర్ హీరోగా ఉపేంద్ర ఓంకారం అనే సినిమా తెరకెక్కించారు.
Upendra: మళ్ళీ అలాంటి అవకాశం వస్తుందో రాదో తెలీదు..!
ఈ సినిమా మంచి హిట్ సాధించింది. అదే సమయంలో అగ్ర నిర్మాత అశ్వనీదత్ నిర్మాణంలో మెగాస్టార్ హీరోగా, ఉపేంద్ర దర్శకత్వంలో ఓ సినిమాకు సన్నాహాలు మొదలై ఆగిపోయాయట. మళ్ళీ ఇప్పటి వరకు ఆ అవకాశం రాలేదని గని ఈవెంట్లో చెప్పుకొచ్చారు. మళ్ళీ అలాంటి అవకాశం వస్తుందో రాదో తెలీదు గానీ, ఎప్పటికప్పుడు మెగా హీరోలతో నటించే అవకాశాలు మాత్రం వారు నాకు కల్పిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కాగా, ఉపేంద్ర.. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నటించారు. గతంలో నాగబాబుతో కలిసి ఓ సినిమాలో నటించిన ఆయన ఇప్పుడు ఆయన కొడుకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో కలిసి గని సినిమాలో నటించారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!