Upendra : అప్పట్లో త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “సన్నాఫ్ సత్యమూర్తి” సినిమాలో ఉపేంద్ర Upendra విలన్ పాత్ర చేయడం అందరికీ తెలిసిందే. సినిమాలో ఉపేంద్ర పాత్రని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేయడం జరిగింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా ఉపేంద్ర ని చాలా స్టైలిష్ గా చూపించడమే కాక అదిరిపోయే విలనిజం తరహాలో స్క్రీన్ పై ఎలివేట్ చేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో మెగా హీరో సినిమాలో ఉపేంద్ర నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు లేటెస్ట్ గా ఫిలిం వర్గాలలో టాక్ నడుస్తుంది.
మేటర్ లోకి వెళ్తే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న “గని” సినిమాలో నటిస్తున్నాడట. సాయి కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ తండ్రిగా ఉపేంద్ర నటించనున్నట్లు సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతోంది. త్వరలోనే ఈ వార్త సినిమా యూనిట్ అధికారికంగా చెప్పనున్నట్లు ఇండస్ట్రీ టాక్. బాక్సింగ్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది జులై 30వ తారీఖున విడుదల కానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన పిక్ బాక్సింగ్ రింగ్ లో వరుణ్ తేజ్ రెండు చేతులకు గ్లౌజ్ వేసుకుని కనిపించటం చూసి చాలామంది మెగా ఫ్యాన్స్ తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ లా ఉందని కామెంట్లు పెడుతున్నారు.